RELATED NEWS
NEWS
'తానా' నూతన కార్యవర్గం ఎన్నిక

 

 

 

 అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2013 - 15 కార్యవర్గ ఎన్నికల్లో ఏకగ్రీవంగా "గెలుపొందిన అభ్యర్థుల ఫలితాలు సోమవారం నాడు విడుదలయ్యాయి. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జంపాల చౌదరి, కార్యదర్శిగా వేమన సతీష్, కోశాధికారిగా తాతా మధు, సహాయ కార్యదర్శిగా కొల్లా సుబ్బారావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, వలివేటి బ్రహ్మాజీ, 'తానా' ఫౌండేషన్ ట్రస్టీలుగా తాళ్లూరి జయశేఖర్, కోయ హరీష్, ప్రాంతీయ సమన్వయకర్తలుగా గుడిసీవ విజయ్ (క్యాపిటల్), పొట్లూరి రవి (మిడ్ - అట్లాంటిక్), యలమంచిలి రావు (న్యూ ఇంగ్లాండ్), పెద్దిబోయిన జోగేశ్వరరావు (నార్త్), మహిధర్ రెడ్డి (నార్త్ వెస్ట్), భక్తా బల్ల (వెస్ట్), తింగమనేని అనిల్ (కెనడా)లు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్ గుండవరం పాపారావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ జంపాల చౌదరి 2015లో తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.


32 సంవత్సరాల తరువాత మొదటిసారిగా తానా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరగటం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఇంతటి అరుదైన గౌరవం, అవకాశం తనకు దక్కినందుకు తానా సభ్యులకు డాక్టర్ జంపాల చోదరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా కోసం, తానా సభ్యుల సంక్షేమం కోసం, తెలుగు వారందరి కోసం, తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డాక్టర్ జంపాల చౌదరి వృత్తిరీత్యా మానసిక వైద్యులు. చికాగో మెడికల్ స్కూల్ లో సైకియాట్రి ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా తానాకు పలువిధాలుగా సేవ చేసిన డాక్టర్ జంపాల చౌదరి, ఎన్నికల ప్రక్రియలు ప్రారంభం అయ్యేంతవరకు తానా పాలకమండలికి చైర్మన్ గా పనిచేశారు. తానా ప్రచురణలు, అంతర్జాలంలో తెలుగు నిఘంటువులు, టీంస్క్వీర్ భద్రతా సూత్రాలు వంటి అనేక తానా కార్యక్రమాలలో డాక్టర్ జంపాల చౌదరి ముఖ్యపాత్ర వహించారు. ప్రస్తుత తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర నుండి ప్రస్తుత కార్యనిర్వాహక ఉపాద్యక్షుడిగా ఉన్న మోహన్ నన్నపనేని 2013 జూన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 2015 జూలై వరకు తానా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

TeluguOne For Your Business
About TeluguOne
;