RELATED NEWS
NEWS
తానా 18వ నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా $200,000 ల విరాళాల సేకరణ

గత మూడు దశాబ్దాలుగా ‘తానా’కు వెన్నుదన్నుగా నిలుస్తున్న సుబ్బారావు అనుమోలు, రాజేశ్వరి అనుమోలు వారి ఆధ్వర్యంలో తానా 18వ నేషనల్ కాన్ఫరెన్స్ న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి 150 తానా శ్రేయోభిలాషులు, లైఫ్ మెంబర్లు పాల్గొన్నారు. తానా ఫౌండేషన్ బోర్డు సభ్యుడు జయశేఖర్ తాళ్ళూరి సభకు విచ్చేసినవారిని సాదరంగా ఆహ్వానిస్తూ న్యూయార్క్ లో TLCA మొట్టమొదటి తెలుగు అసోషియేషన్ అని తానా వారి మొదటి కాన్ఫరెన్స్ న్యూయార్క్ లో TLCA వారు నిర్వహించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తానావారు తానా ఫౌండేషన్ నిర్వహించే స్కాలర్ షిప్స్, కాటరాక్ట్ సర్జరీలు పలు అభివృద్ధి కార్యక్రాల గురించి వివరించారు.

సుబ్బారావు అనుమోలు మాట్లాడుతూ తానా అంతర్జాతీయంగా పేరుపొందిన సంస్థ అని, నార్త్ అమెరికాలో నివసించే తెలుగు ప్రజల కోసం పరితపించే సంస్థ అని, తానా వారు తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిచడంలోను వారి సామాజిక అవసరాలను తీర్చడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తానా ప్రెసిడెంట్ జయరాం కోమటి సభను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసమే తాము పాతుపడుతున్నామని, తామందరూ సంఘటితంగా ఉండడమే ముఖ్యమని, తమ సంస్థ ఆదర్శాలతో పనిచేసే మిగిలిన సంఘాలతో ముందుకు సాగాలని, తమ సంస్థ ప్రతిష్టను దిగజార్చే వారిని ప్రోత్సహించకూడదని తెలియజేశారు.

తానా 18వ నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా $200,000 ల విరాళాల సేకరణతానా 18వ నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా $200,000 ల విరాళాల సేకరణ

 

 

 

 

 

 

 

తానా కో-ఆర్డినేటర్ సతీష్ చిలుకూరి 18వ కాన్ఫరెన్స్ అభివృద్ధిని తెలియజేస్తూ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువతను ప్రోత్సహించడమని, యువతను ప్రోత్సహించడానికి ‘తెలుగు యువత ప్రగతి ప్రతీక’ అనే థీమ్ ను ఎంచుకున్నామని తెలిపారు. దేశనలుమూలల నుండి ఈ థీమ్ కు మంచి స్పందన లభిస్తుందని, గొప్ప కాన్ఫరెన్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా సభకు విచ్చేసిన వారికి తెలియచేశారు.

తానా ఎమెర్జెన్సీ అసిస్టెన్స్ మేనేజ్ మెంట్ వారి విధుల గురించి తానా సెక్రటరీ మోహన్ నన్నపనేని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే తెలుగువారికి తానా మొదటి వారధిగా కనబడుతుందని, గత రెండు సంవత్సరాలుగా తానా సభ్యులు, దాతలు, వాలంటీర్లు 70కి పైగా ఇలాంటి వారికి దాదాపు $200,000 సహాయాన్ని అందించామని, తానా వారి తరపున తమకు మద్దతునిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నానని తెలియచేశారు.

తానా 18వ నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా $200,000 ల విరాళాల సేకరణతానా 18వ నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా $200,000 ల విరాళాల సేకరణ

 

 

 

 

 

 

 

$20,000లను విరాళంగా ఇచ్చిన శ్రీ సాంబశివరావు వెనిగళ్ళ, శ్రీమతి మహాలక్ష్మి వెనిగళ్ళ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. ఈ సభలోనే $200,000 డాలర్లను దాతల ద్వారా విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా తానా ప్రెసిడెంట్ జయరాం కోమటి ఈ సభను నిర్వహించిన, అనుమోలు దంపతులను, విరాళాలు అందించిన దాతలను, సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి తమ కృతజ్ఞతలు తెలియచేశారు.

కాలిఫోర్నియాలోని శాంతక్లారలో జరిగే తానా కాన్ఫరెన్స్ కు అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ సభలో మాజీ ప్రెసిడెంట్ లు డాక్టర్ దశరథ రామిరెడ్డి, గంగాధర్ నాదెళ్ళ, తానా ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ నరేన్ కొడాలి, సతీష్ వేమన, సుబ్బారాలు కొల్ల, జయ్ కురేటి, తిరుమలరావు తిపిర్నేని, డాక్టర్ తులసి, రాఘవరావు పోలవరపు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;