- Floral Tribute To Gandhi In Dallas
- డాలస్ లో జాతిపితకు తెలుగు రాష్ట్రాల నాయకుల ఘన నివాళి
- లాస్ ఏంజిల్స్, డాలస్ నగరాల్లో ఘనంగా మనబడి స్నాతకోత్సవం
- Manabadi – Telugu University Exams In Usa & Canada
- Grand Republic Day Celebrations At Gandhi Memorial In Dallas, Texas
- గాంధీ జయంతి సందర్భంగా డాలస్ లో నాట్స్ 5కె రన్
- Mgmnt Organized International Day Of Yoga In Dallas
- Reach Excellence 2013 - డల్లాస్ - స్వామి వివేకానందుని 150వ జన్మ దిన ఉత్సవాలు !
- Data Celebrate Telangana Banquet & Cultural Night On A Grand Note
- Dr.ghazal Srinivas "voice" For Save Temples
- డల్లాస్ లో వైభవంగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
- మహాశివరాత్రి దినాన – డల్లాస్ లో టాంటెక్స్ తెలుగు వెన్నెల
- Mahatma Birthday Celebrations In Dallas By Iafc
- నాట్స్ ఆధ్వర్యంలో డాలస్ లో ఉచిత వైద్య శిబిరం
- 3rd International Day Of Yoga” At Mahatma Gandhi Memorial In Dallas
- మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు
- Dallas Reception For Hon. Cm Shri Nara Chandrababu Naidu Garu
- Granddaughter Of Gandhiji, Pays Tribute At Gandhi Memorial In Dallas
- డాలస్ లో ‘గాంధీతాత చెట్టు’ తెలుగు సినిమా ఉచిత ప్రదర్శన
- డాలస్ నగరంలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- డలాస్లో మహాత్ముడికి నివాళి అర్పించిన భారత అంధుల క్రికెట్ టీం
- డాలస్లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారతదేశ78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు
- డాలస్ నరంలో మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించిన రేవంత్ రెడ్డి
డాలస్, టెక్సస్: ‘గాంధీతాత చెట్టు’ అనే తెలుగు సినిమా నిర్మాత శేష సింధూ రావు, తెలుగు-ఇండి ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ అమెరికా దేశంలోనే అతి పెద్దదైన డాలస్ లో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించి బాపూజికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ‘మహాత్మాగాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఒక బాలిక ద్వారా చెప్పించడం భావితరాలకు వారధిగా నిలిచే ఒక గొప్ప సందేశం ఈ చలనచిత్రంలో ఇమిడి ఉందని, ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి సినిమా తీయాలనే తలంపు రావడం అభినందనీయం అంటూ సినీ నిర్మాత, దర్శకులకు శుభాకాంక్షలు అందజేశారు.’ ఈ చలనచిత్ర నిర్మాత శేష సింధూరావు, తెలుగు ఇండిక్ ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ లు మాట్లాడుతూ ఈ సినిమాలో సుకృతి వేణి బండ్రెడ్డి ప్రముఖ దర్శకులు సుకుమార్ కుమార్తె పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని, ఈ చిత్రనిర్మాణంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకులు సుకుమార్ అందించిన సహకారం వెలకట్టలేనిది అన్నారు. ఈ ‘గాంధీతాత చెట్టు’ అనే తెలుగు సినీమాను గాలాక్సీ యట్ గ్రాండ్ స్కేప్, ది కాలనీ లో నవంబర్ 16, శనివారం సాయంత్రం 6 గంటలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు, ఆసక్తిఉన్నవారు namaste@indicapictures.com కు email చేసి తమ టికెట్లను పొందవచ్చు అన్నారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వల, గవర్నింగ్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు చలనచిత్ర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి. శ్రీనివాస్, ఎ.కె నాయుడు మరికొంతమంది ప్రవాసభారతీయులు పాల్గొన్నారు.