RELATED EVENTS
EVENTS
డల్లాస్ లో వైభవంగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు, డల్లాస్ నగరంలోని థామస్ జఫర్సన్ హైస్కూల్లో ఉగాది ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు గీత దమ్మన మరియు కార్యక్రమ సమన్వయ కర్త సురేష్ మండువ అధ్వర్యంలో సాంస్కృతిక కార్యదర్శి మహేష్ ఆదిభట్ల ఈ కార్యక్రమాలని నిర్వహించారు. మరియు ఇండియన్ రెస్టారెంట్ వారు ఉగాది పచ్చడితో కూడిన రుచికరమైన విందు భోజనాన్ని వడ్డించారు.

 

Dallas ugadhi ustavalu, Telugu Association North Texas ugadhi utsavalu, nri news, telugu nri news, dallas nri news

 

మహా గణపతిం కూచిపూడి నృత్యం మరియు భో శంభో భరత నాట్యం

రాళ్లబండి సుబ్రహ్మణ్యం పంచాంగ శ్రవణాలతో కార్యక్రమ శుభారంభం జరిగింది. డల్లాస్ లిటిల్ మ్యుజిసియన్స్ అకాడెమి బాల బాలికలు ఆలాపించిన సినిమా పాటల సందడి అందరిని అబ్బురపరిచింది. జగదానంద కారక, పూసింది పూసింది పున్నాగ, తరలిరాద తనే వసంతం, చందమామ రావే వంటి ఆణిముత్యాలలాంటి పాటలను పాడి అమెరికాలో పెరుగుతున్న పిల్లలు అచ్చమైన తెలుగు పిల్లలనిపించారు. తదుపరి గీత దమ్మన గారు నందన నామ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలో సంస్థ అభివృద్దికి తోడ్పాటునందిస్తున్న పోషక దాతలకు, కార్యవర్గానికి, సభ్యులకు కృతఙ్ఞతలు తెలియ చేశారు. తదుపరి టాంటెక్స్ రేడియో కార్యక్రమం "గాన సుధ" రేడియో వ్యాఖ్యాతలను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు.

 

Dallas ugadhi ustavalu, Telugu Association North Texas ugadhi utsavalu, nri news, telugu nri news, dallas nri news

 

భారత దేశంనుండి ప్రముఖ నేపథ్య గాయకులు పార్థసారధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయన సంగీత విభావరిలో భాగంగా ఆలపించిన ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఓం నమో శివ రుద్రాయ, ఆడవే మయూరి పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. స్థానిక గాయకురాలు జ్యోతి సాధు, పార్థుతో కలిసి హుషారు గొలిపే యుగళ గీతాల్ని ఆలాపించారు. పార్థసారధి గారిని కార్యవర్గ సభ్యురాలు జ్యోతి వనం గారు పుష్ప గుచ్చంతో, ఉత్తరాధ్యక్షులు సురేష్ మండువ మరియు ఉపాధ్యక్షులు విజయ్ కాకర్ల శాలువాతో, అధ్యక్షురాలు గీత దమ్మన మరియు పాలక వర్గ అధ్యక్షులు ఆల్ల శ్రీనివాస రెడ్డి గారు జ్ఞాపికతో సత్కరించారు.

 

Dallas ugadhi ustavalu, Telugu Association North Texas ugadhi utsavalu, nri news, telugu nri news, dallas nri news

 

ఉగాది ఉత్సవాల సందర్భంగా శీలం కృష్ణవేణి మరియు ఇందు మందాడి గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి ఉగాది పచ్చడి పోటీలు మరియు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులనందించారు. మనబడి పిల్లలు ప్రదర్శించిన "అక్షరమాల" నృత్య రూపకం తెలుగు భాష తీయదనానికి దర్పణం పట్టింది. సరిత రెడ్డి నిర్వహించిన పిల్లల జాన్కారి బీట్స్ మరియు జ్యోతి వనం నిర్వహించిన ఉగాది నవరసాల సినిమా పాటల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.

 

Dallas ugadhi ustavalu, Telugu Association North Texas ugadhi utsavalu, nri news, telugu nri news, dallas nri news

 

చివరగా స్ఫూర్తి టీం చేసిన సినిమా నృత్యాలతో కార్యక్రమం హుషారుగా ముగిసింది. కార్యక్రమ పోషక దాతలైన మయూరి ఇండియన్ రెస్టారెంట్, మై టాక్స్ ఫైలర్, పర్ఫెక్ట్ టాక్స్, బేలర్ మెడికల్ సెంటర్, హోరైజాన్ ట్రావెల్స్, ప్యారడైజ్ బిర్యాని పాయింట్, పసంద్ రెస్టారెంట్, సౌత్ ఫోర్క్ డెంటల్, లాసన్ ట్రావెల్స్, యూనికాన్ ట్రావెల్స్, ఎంజి ఫ్యామిలి డెంటల్, అవర్ ప్లేస్ రెస్టారెంట్, మనసుతో.కాం లకు కృతఙ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక బృంద సభ్యులు మహేష్ ఆదిభట్ల, సాహితి సోలాస, పద్మశ్రీ తోట, ప్రవీణ్ బిల్లా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

 

Dallas ugadhi ustavalu, Telugu Association North Texas ugadhi utsavalu, nri news, telugu nri news, dallas nri news

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;