RELATED EVENTS
EVENTS
గాంధీ జయంతి సందర్భంగా డాలస్ లో నాట్స్ 5కె రన్

 

 

గాంధీ జయంతి సందర్భంగా డాలస్ లో  నాట్స్ 5కె రన్

 

మహాత్ముడి బాటలో పయనించాలనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డాలస్ ఛాప్టర్ చేపట్టిన 5కె రన్ కు విశేష స్పందన లభించింది. ఇర్వింగ్ లోని ట్రైల్ పార్క్ లో నిర్వహించిన ఈ పరుగులో దాదాపు 250 మంది భారతీయులు పాల్గొన్నారు. గాంధీ జయంతి నాడు చేపట్టిన ఈ రన్  డీఎఫ్ ఓ మెట్రో దగ్గర ప్రారంభమైంది. చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది కుటుంబ సభ్యులు.. పిల్లలతో సహా ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు.


నాట్స్ 5కె రన్ /వాక్ తో పాటు 1కె ఫన్ వాక్ కూడా చేపట్టింది. ఈ పరుగులో ముందు నిలిచిన మొదటి ముగ్గురికి మహిళ, పురుష విభాగాల్లో బహుమతులు అందించింది.. ఈ కార్యక్రమంతో పాటుగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ ద్వారా  సేకరించిన ఆహార సామాగ్రిని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి అందించారు. అలాగేకార్యక్రమ నిర్వహణ ద్వారా లభించిన మొత్తాన్ని అమెరికాలోని నాట్స్ హెల్ప్ లైన్ నిర్వహణ నిమిత్తం అందించారు. నాట్స్ నిర్వహించిన  ఈ 5కె రన్ పట్ల స్థానిక భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. నాట్స్ నాయకులు, వాలంటీర్ల సేవలను వారు కొనియాడారు.. నాట్స్ చేపట్టే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. డాలస్ నాట్స్ ఛాప్టర్ స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాల్లో 5కె రన్ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు నాట్స్ తెలిపింది.

బావర్చి బిర్యాని పాయింట్, అక్సెల్ ఇంటర్నేషనల్, యునైటె ఐటీ సొలుష్యన్స్, వెక్ట్రా ఇన్ ఫోసిస్ ఐఎన్సీ, సాయి నివాస్ టూర్స్. కామ్, కాంట్ సిస్టమ్స్ సంస్థలు ఈ ఈవెంట్ కు స్పాన్సర్లుగా వ్యవహారించాయి.  5కె రన్ కు హజరైన  ఇర్వింగ్ డిప్యూటీ మేయర్ బ్రాడ్ ఎం. లామోర్గీస్ నాట్స్ చేపట్టిన ఈ  కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.


రాజేంద్ర మాదాల, బాపునూతి, చైతన్య కంచర్ల, సురేంద్ర ధూళిపాళ్ల, కిషోర్ వీరగంధం, రామకృష్ణ మర్నేని, రామకృష్ణ నిమ్మగడ్డ, శ్రీధర్ విన్నమూరి, వెంకట్ పోలినేని, చక్రధర్ అమరవాయి, పవన్ కుమార్ కొత్తారు, అశోక్, అది గెల్లి, రామిరెడ్డి, ప్రసన్న మట్టుపల్లి, వశిష్ట్ గార్లపాటి, మురళీ కొండపాటి, శ్రీకాంత్ పువ్వాడి తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.  అనేక విద్యార్ధులు వాలంటీర్లుగా తమ విలువైన సేవలు అందించారు. నాట్స్ ఈ కార్యక్రమంలో  వాలంటీర్లుగా పనిచేసిన హైస్కూలు విద్యార్ధులను ప్రత్యేకంగా అభినందించి.. వారి సేవలను ప్రశంసించింది.

TeluguOne For Your Business
About TeluguOne
;