RELATED EVENTS
EVENTS
అమెరికాలో భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందు డాలస్ పర్యటన విజయవంతం

డాలస్, టెక్సాస్: ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐ.ఎ.ఎఫ్.సి) మరియు ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (ఐ.ఎ.ఎన్.టి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 50 వివిధ భారతీయ సంఘాల నుండి 200 కు పైగా నాయకులు హాజరైన సభలో అమెరికాలో భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందు ముఖ్య అతిధిగా, భారత కాన్సులేట్ అధికారి అసీం మహాజన్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.

ఐ.ఎ.ఎన్.టి అధ్యక్షుడు శైలేష్ షా కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ ను సభకు పరిచయం చేయగా కాన్సులేట్ అధికారులు డాలస్ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రవాస భారతీయులకు అవసరమైన సేవలందించేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఐ.ఎ.ఎఫ్.సి అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథి భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందును సభకు పరిచయం చేస్తూ అమెరికా వ్యవహారాల పై అత్యదిక పట్టు ఉన్న దౌత్య అధికారి మరియు అమెరికా దౌత్య కార్యాలయం, వాషింగ్టన్ డి.సి లో మరియు భద్రతా మండలి, న్యూయార్క్ లో గతంలో ఎన్నో సంవత్సరాలు గా పని చేసిన విశేష అనుభవం ఉన్న అధికారి అని తెలియజేశారు.

 

గత సంవత్సరం ఫిబ్రవరి లో అమెరికా దేశం లో భారత రాయబారిగా పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి డాలస్ పర్యటన అని, అందుకు భారత రాయబారికి ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. భారత రాయబారి తరంజిత్ సింగ్ సందు సభనుద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా దేశంలోనే డాలస్ నగరం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, టెక్సాస్ రాష్ట్రం లో ప్రవాస భారతీయులు అత్యదిక సంఖ్యలో వివిధ రంగాలలో రాణిస్తున్నారని, అమెరికా భారత దేశాల మధ్య సత్సంభంధాలు, వాణిజ్య అభివృద్ధికి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ ఇతోధికంగా కృషి చేస్తున్నారని, అలాగే భారతదేశం కూడా ఎంతో ఆసక్తి తో అవసరమైన అన్ని అనుమతులను జారీ చేస్తూ ఆర్ధిక సంభందాల బలోపేతంలో కూడా ముందుకు సాగుతుంది అన్నారు.

జాతీయ సమైక్యతా దినంగా సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు జరుపుకోవడం చాల సంతోషం అన్నారు. సభానంతరం భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందు అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారక విగ్రహాన్ని దర్శించి గాంధీజీ కి పుష్పగుచ్చాలనుంచి ఘన నివాళులర్పించారు. ఇంత పెద్ద నిర్మాణం గావించిన మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరను, బోర్డు సభ్యులను, ఇర్వింగ్ పట్టణ అధికారులను ఆయన అభినందించారు. ఐ.ఎ.ఎఫ్.సి అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు బోర్డు సభ్యులు భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందును ఘనంగా దుశ్శాలువ తో సన్మానించి ఒక జ్ఞాపిక ను బహుకరించారు. అలాగే ఐ.ఎ.ఎన్.టి అధ్యక్షుడు శైలేష్ షా మరియు బోర్డు సభ్యులు కూడా ఆయనను ఘనంగా సన్మానించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;