విశాఖలో ఐఎస్‌ల మద్యవార్‌

Publish Date:Aug 19, 2012

Advertisement

విశాఖపట్టణంలో ఇద్దరి ఐఎఎస్‌ అధికారుల అధికారుల మద్యపచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఉన్నత స్ధాయి అధికారులమని మరచి పోయి ప్రతి చిన్న విషయానికి రచ్చకెక్కటం ప్రజలను అయోమయానికి గురి చేస్తుంది. ఒకరు విశాఖ కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌కాగా మరొకరు మహావిశాఖ నగర పాలక సంస్థ కమీషనర్‌ రామాంజనేయులు. ఆరు నెలల క్రితం జివిఎంసీపాలక వర్గం పదవీకాలం ముగిసి పోవడంతో దానికి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టాలని రామాంజనేయులు ప్రయత్నించారు.

 


అయితే లవ్‌ అగర్వాల్‌ పోటీపడి ఆ పదవిని దక్కించుకున్నారు. అప్పటినుండి ఇద్దరికి మద్య విభేదాలు ముదిరాయి. ప్రత్యేక అధికారిగా జీవియం ఫైళ్లను తొక్కి పెడుతున్నారనేది కమీషనర్‌ వాదన. ఇటీవల కాలంలో బదిలీలలో వీరిద్దరి పేర్లు ఉండగా విశాఖ అభివృద్దికి ఇద్దరం కలసికట్టుగా పని చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్‌కు చెప్పి బదిలీ లేకుండా చేసుకున్నారు. అయినా యధాప్రకారం దులాడుకుంటున్నారు. మంత్రి తనకంటే కలెక్టర్‌కే అధిక ప్రాధాన్యత నిస్తున్నారని కమీషనర్‌ మరో మంత్రి బాలరాజు చెంత చేరారు.తాజాగా స్వాతంత్య్రదినోత్సవ నాడు వారి విభేదాలు తారా స్ధాయికందుకున్నాయి. ఆరోజు జిల్లా కలెక్టరు ఆఫీసులో జెండా ఎగురవేసి జివిఎంసీలో కూడా ఎగురవేద్దామని లవ్‌ అగర్వాల్‌ అక్కడకు చేరుకోగా అక్కడ తలుపులు వేసిఉండటంతో అవాక్కయ్యారు.




దీంతో సంబంధిత ఏఈ పై నిప్పులు చెరిగి, బ్లడీ ఆర్గనైజింగ్‌ అంటూ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవియంసీ లో తనను కావాలనే అవమాన పరిచారని చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అయితే కమీషనర్‌ వాదన మరోలా ఉంది. తన కంటే జూనియర్‌ అధికారులు వారి కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరిస్తే కలెక్టర్‌ కావాలనే ఇదంతా చేశారని మంత్రి బాలరాజుకు వివరించి ఆయన సాయంతోడిప్యూటీ సీఎం రాజనరసింహను కలసి తన వాదనను వినిపించారు. ఈవిషయంలో ఎవరూ తగ్గక పోగా తాడో పేడో తేల్చుకుంటామని బుసలు కొడుతున్నారు. అయితే వీరిద్దరి మద్య జిల్లాపరువు పోతుందని నగరవాసులు వాపోతున్నారు. వీరి పంతాలు పట్టింపులకే సమయం సరిపోతుందని, ప్రజలసమస్యలను గాలికి ఒదిలేశారని స్దానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వీరిరువరినీ బదిలీ చేయాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.