Publish Date:Jan 31, 2025
2019 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత తాజాగా మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని కోరుతూ ఆమె సత్వరమే విచారణ పూర్తి చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని, ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని.. ఆరు నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పేర్కొన్నారు. . సీబీఐ సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారన్నారు. రోజుకు 500 ఫైల్స్ చొప్పున ఓపెన్ చేసుకుంటూ పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్ ప్రారంభం కాదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అంతే కాకుండా తన పిటిషన్ లో ఈ కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని, వారి మరణాలు అనుమానాస్పద స్థితిలో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా ట్రయల్ ప్రారంభించాలని కోరారు. కాగా సునీత్ పిటిషన్ ను కోర్టు ఫిబ్రవరి 4న విచారించనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-sunitha-petition-in-telangana-hicourt-39-192143.html
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.