ఆ ఐదూ ఇస్తే... విలీనం!?

Publish Date:Aug 17, 2023

Advertisement

తన పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సెగ్మెంట్లు ఇవ్వాలన్న డిమాండును  వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల ఆ పార్టీ హైకమాండ్ ముందుంచిందా.. అలా అయితేనే విలీన ప్రక్రియకు సై చెతానని షర్మిల షరతు పెట్టిందా.. అంటే అవుననే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కన్న కలలను నిజం చేయాలన్న ఉద్దేశంతో షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటు న్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమె సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న షర్మిల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ షర్మిలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భర్త అనిల్, పార్టీ ముఖ్యలతో సుదీర్ఘ మంతనాల అనంతరం షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పలు దఫాలు ఢిల్లీ వెళ్లిన బ్రదర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పెద్దలతోనూ వరుస భేటీలు నిర్వహించి విలీన ప్రక్రియ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పాత్రపై చర్చినట్టు వార్తలొచ్చాయి. నాలుగు రోజుల క్రితం షర్మిల, అనిల్ హస్తిన వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశమై విలీన ప్రక్రియ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన షర్మిల అంతకుముందు డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా సమావేశమై సమాలోచనలు జరిపినట్టు సమాచారం. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న విషయాన్ని షర్మిల పార్టీ సీనియర్లతో సమావేశమై చెప్పి వారి అభిప్రాయాలను సేకరించినట్టు తెలుస్తోంది. వరుసగా రెండు రోజులపాటు ఆమె ఇక్కడి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో నేతలను కలుస్తూ వారితో చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో దఫా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ విలీనం తర్వాత జరగనున్న పరిణామాలను అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఇచ్చే సీట్ల విషయంలో స్పష్టతకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరో నాలుగైదు నెలల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఐదు అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో ఎటూ తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ కొట్టు మిట్టాడుతోంది. తాజాగా షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ఒక వైపు డీకే శివకుమార్ పట్టుబట్టి షర్మిల పార్టీని విలీనం చేసే దిశగా చర్యలు చెపట్టారని, ఇప్పుడు ఈ విషయంలో వెనక్కు తగ్గినా ప్రక్రియను వ్యతిరేకించినా వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఉండదన్న ఆందోళన పీసీసీ నేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం.

కాగా షర్మిల కోరుతున్నట్టు ఐదు అసెంబ్లీ స్థానాలివ్వడానికి రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధంగా లేదన్న సంకేతాలను పార్టీ ముఖ్యనేతలు డీకే శివకుమార్ కు పంపించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి లేదా నకిరేకల్, సికింద్రాబాద్ స్థానాలను షర్మిల కోరుతున్నట్టు చెబుతున్నారు. పాలేరు నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించడంతో పాటు అక్కడ పార్టీ కార్యాలయాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. షర్మిల అనుచరుడు ఏపూరు సోమన్న తుంగతుర్తి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి సుజాతను బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఐదు సీట్లు కోరుతున్న షర్మిలకు నచ్చజెప్పి రెండు స్థానాలను ఇవ్వాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టు చెబుతున్నారు. అప్పటికీ ఆమె మరో సీటు కోసం పట్టుబడితే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు వినికిడి. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న షర్మిల అక్కడే పార్టీ పెద్దలను కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవాలని ప్రతిపాదించారని ఆమె సన్నిహిత నేతలు వివరించారు. ఏది ఏమైనా.. షర్మిలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మాత్రం ఖాయం.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.