జగన్ ...హిందువులకు దగ్గర అవుతున్నారా?
Publish Date:Sep 14, 2015
Advertisement
వైఎస్ జగన్మోహన్ రెడ్డి...పక్కా క్రిస్టియన్... తాతల కాలం నుంచే ఆయనది క్రైస్తవ కుటుంబం. జగన్ తాత రాజారెడ్డి తరానికంటే ముందే క్రైస్తవ మతంలోకి మారారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కూడా దాదాపు క్రైస్తవ్యంలోకి మారిన వాళ్లే. వైఎస్ కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించి బాప్తిస్మం తీసుకున్నా, జగన్ మాదిరిగా పెద్దగా ఫోకస్ కాలేదు. వైఎస్ క్రైస్తవుడే అయినా, అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ, హిందూ సంప్రదాయాలనూ పాటిస్తూ అందరివాడినన్న భావన కలిగించేవాడు. ఎన్నికల ప్రచారంలోనూ నుదుటన తిలకం దిద్ది...పక్కా హిందువుగా కనిపించేవారు. జగన్ దీనికి భిన్నంగా వ్యవహరించారు, పక్కా క్రిస్టియన్ గా ప్రజల్లో ఫోకస్ అయ్యేవారు, వైఎస్ భార్య విజయమ్మ, కూతురు షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ అయితే క్రైస్తవ ప్రచారకులుగా గుర్తింపు పొందారు. ఈ గుర్తింపే...జగన్ కు మైనస్ గా మారిందని, 2014 ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి కారణమైందని వైసీపీ నేతలు అంటున్నారు. లోటస్ పాండ్ లోని ఇంటికి పెద్దగా సిలువ సింబల్ వేయడం, ఎన్నికల ప్రచారంలో జగన్ ఎక్కువగా చర్చిలకే వెళ్లడం, హిందువులకు నచ్చలేదని, ఈ గుర్తింపు వల్లే రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా పూర్తిస్థాయిలో మద్దతు లభించలేదని అంటున్నారు. జగన్... క్రిస్టియన్... మనోడు కాదని రెడ్డి వర్గం భావించిందని, అందుకే రెడ్డి డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు.
అయితే క్రిస్టియన్ గుర్తింపుతో వైసీపీకి కొన్ని వర్గాలు బలంగా కొమ్ముకాసినా, హిందువులు పెద్దమొత్తంలో దూరమవడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని గుర్తించిన జగన్... లోటస్ పాండ్ లోని తన ఇంటికి సిలువ గుర్తు తీయించేశారు. హిందువులకు దగ్గరైతేనే లక్ష్యాన్ని చేరుకోగలమని, లేదంటే 2014 రిజల్టే రిపీట్ అవుతుందని భావిస్తున్నారట, అందుకే సీనియర్ల సూచన మేరకు అప్పుడప్పుడూ స్వామిజీలను, పీఠాధిపతులను, బాబాలను కలుస్తూ... హిందువులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి మొన్న గోదావరి పుష్కరాల్లో హిందూ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని స్నానం ఆచరించి పిండ ప్రదానం చేశారు.ఇప్పుడు తాజాగా జ్యోతిష్కుడు రమణారావు సూచన మేరకు శాంతి హోమం చేయిస్తున్నారట.
మరి జగన్ ఆశిస్తున్నట్లుగా 2019 నాటికైనా హిందువులు వైసీపీ దగ్గరవుతారో లేదో చూడాలి.
http://www.teluguone.com/news/content/ys-jagan-mohan-reddy-45-50058.html





