ఏపీలో డీఎస్సీ వినా సమస్యలే లేవా.. వైసీపీ తీరు పట్ల పార్టీ శ్రేణుల్లోనే పెదవి విరుపు.!

Publish Date:Sep 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను   అస్త్రంగా మలచుకుని అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ తీరుపై పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఈ తరహా రాజకీయ వ్యూహం ఏ మేరకు సఫలమవుతుంద అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే . ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం ఒకే అంశంపై పదే పదే దృష్టి పెట్టడం వల్ల రాజకీయంగా ఆశించిన ప్రయోజనం దక్కుతుందా? అన్న సందేహాలు వైసీపీయులలోనే వ్యక్తం అవుతున్నాయి. 

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది. ఈ అంశాన్ని విడతలవారీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వ తీరును నిలదీసేలా వ్యూహాలు రచిస్తున్నది..

అయితే.. ఈ తరహా నిరంతర ఆరోపణలు క్షేత్రస్థాయిలో ఏ రకమైన ఫలితాలను ఇస్తున్నాయన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు.  వైసీపీ విమర్శలు, ఆందోళనల పట్ల జనబాహుల్యంలో ఎటువంటి ఆసక్తీ కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు వైసీపీ ఆరోపణలు, విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో   ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోని తీరును ఎత్తి చూపుతున్నారు, ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆందోళన పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అని ఎదురుదాడికి దిగుతున్నారు.  

రాజకీయంగా చూస్తే, వైసీపీ తీరు.. సొంత పార్టీ నేతలు, శ్రేణుల్లోనే గందరగోళం సృష్టిస్తోంది.   ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం ఒకే ఒక్క పరీక్షా విధానంపై మాత్రమే గళమెత్తడం వల్ల రాజకీయ ప్రయోజనం అటుంచి.. నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.  

అన్నిటికీ మించి డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ ఆరోపణలు, విమర్శలను అధికార యంత్రాంగం కొట్టి పారేస్తున్నది. వైసీపీ విమర్శించిన ప్రతి అంశంపైనా స్పష్టమైన వివరణ అధికారికంగా ఇస్తూ.. నియామక ప్రక్రియపారదర్శకంగా జరిగిందని ఆధారాలతో సహా వివరణ ఇచ్చున్నది.  దీనివల్ల కూడా వైసీపీ డీఎస్సీపై చేస్తున్న విమర్శలు నీరుగారిపోతున్నాయి.  ఇంకా డీఎస్సీ నియామకాలలో అవకతవకలు అంటూ వైసీపీ దానినే పట్టుకు వేళాడితే.. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ మరింత పలుచన అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[YS Jagan, Mega DSC controversy, YCP political strategy, AP teacher recruitment, ruling and opposition politics, Telugu One]

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.