వైఎస్ కుటుంబం ఊగిసలాట

Publish Date:Apr 25, 2023

Advertisement

ప్రస్తుత రాజకీయాలు నాలుగు వ్యవస్థల చుట్టూ తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు లాంటి న్యాయ వ్యస్థలు, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలలో రాజకీయ వివాదాల పరిష్కారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తి పెద్దది, ప్రతిభామంతమైన రాజకీయ కుటుంబాలలో ఎదురింటి సందించి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది.

అలాంటి వైఎస్ కుటుంబం ప్రస్తుతం ఆ వ్యవస్థలు, సంస్థల మధ్య చక్కర్లు కొడుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తూ దోషులను పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్లు సీబీఐకి దొరక్కుండా న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారు.  హత్యకు గురైన తన తండ్రికి న్యాయం జరగాలంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సునీత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కేసు తిరిగి సీబీఐ చేతికి చిక్కింది.  

ఆంధ్రప్రదేశ్ నుండి కేసును తెలంగాణకు బదలాయించాలంటూ సునీత చేసి పరాటంతో వివేకా హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఎప్పటికప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయన వాదనలు పై కోర్టుల్లో నిలవడం లేదు.గతంలో జాతీయ స్థాయిలో సంచలనం కలిగించినజగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11చార్జిషీట్లను వేసింది.  ఆ కేసులలో 16నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ఎప్పటికైనా కేసులను ఎదుర్కొనక తప్పదు. ఇదంతా చూస్తుంటే 2009 వరకూ రాజకీయాలను శాసించిన వైఎస్ కుటుంబం, రాజశేఖరరెడ్డి మరణంతో కష్టాల బారిన పడిందనే చెప్పాలి. ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా నిలబడి రాజకీయాలు నడిపిన వైఎస్ఆర్  తన తరువాతి తరం ఇలా వివాదాల్లో చిక్కుకుంటుందని ఊహించి ఉండరు. అయితే మితిమీరినరాజకీయ పలుకుబడి, పరిమితులు లేని ఆశ వైఎస్ కుటుంబాన్ని ఈ స్థాయికి చేర్చిందని కడపకు చెందిన రాజకీయ నేతలే అంటున్నారు.  

జగన్ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులే కాక ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్ననిర్ణయాలు వైఎస్ కుటుంబ ప్రతిష్టను మసక బారేలా చేశాయని వీరి వాదన. 151 స్థానాల్లో గెలిపించిన ప్రజలకు జగన్ చేసిందేమీ లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిరోజూ కూసుల నుంచి బయటకు వచ్చే వ్యూహాలపైనే చర్చిస్తూ బిజీగా ఉండే  పాలకులు ప్రజలను ఏం పట్టించుకుంటారనేది ప్రతిపక్ష పార్టీల వాదన. ఏది ఏమైనాజగన్ నుండి, సునీత వరకూ వైఎస్ కుటుంబమంతా నిఘా సంస్థలు, న్యాయస్థానాల మధ్య కాలాన్ని గడపాల్సి రావడం విచారకరం. 

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.