మంత్రి అంబటికి స్థానభ్రంశం తప్పదా?

Publish Date:Jul 29, 2023

Advertisement

మంత్రి అంబటి రాంబాబు పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వివాదాలలో, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో ఉంటారు. ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యే కూడా. అయితే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ నుంచి ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి టికెట్ దొరికే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించినా అంబటిని అక్కడ నుంచి మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

అయితే అలా మార్చడానికి కారణం జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వచ్చిన రిపోర్టు మాత్రం కాదని అంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చార్జ్ తీసుకోవడమే అంబటి స్థానభ్రంశానికి కారణమని అంటున్నారు. ఇదేమిటి.. తెలుగుదేశం ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను ఆ పార్టీ నియమిస్తే.. వైసీపీ ఎమ్మెల్యే మంత్రి అంబటి టికెట్ కు ఎసరేమిటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది రాజకీయం.

ఏపీ రాజకీయాలలో  రాయపాటి  సాంబశివరావుకు ఉన్న ప్రాధాన్యత పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ కన్నాను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించడంతో రాయపాటి అలిగారు.  ఎందుకంటే కన్నా లక్ష్మినారాయణ రాయపాటికి చిరకాల ప్రత్యర్థి. అటువంటి కన్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడమే కాకుండా,  సత్తెనపల్లి టికెట్‌ ఖరారు చేస్తూ ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో  రాయపాటికి ఆగ్రహం వచ్చింది. ఈసారి తన కుమారుడికి,  మరో ఇద్దరికీ తాను సూచించిన చోట తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకుంటే తానే రంగంలోకి దిగుతానని రాయపాటి ప్రకటించారు.  

అయితే ఆయన హెచ్చరిక లాంటి ప్రకటనను పార్టీ అధినేత చంద్రబాబు ఇసుమంతైనా పట్టించుకోలేదు. దీంతో రాయపాటి అలిగారని అంటున్నారు. రాయపాటి  అసంతృప్తిని గమనించిన వైసీపీ వెంటనే రంగంలోకి దిగి  గుంటూరు లోక్‌సభ, సత్తెనపల్లి శాసనసభ సీటు ఆఫర్ చేసిన్నట్లు తెలుస్తోంది. గుంటూరు నుంచి లోక్‌సభకు రాయపాటి, సత్తెనపల్లి నుంచి శాసనసభకు ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం ఇస్తామన్నది వైసీపీ ఆఫర్ గా చెబుతున్నారు. ఆ ఆఫర్ ను రాయపాటి అంగీకరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒక వేళ అదే జరిగితే ప్రస్తుతం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి  ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటికి స్థానభ్రంతం తప్పదని అంటున్నారు.  

సత్తెనపల్లిలో బలమైన తెలుగుదేశం అభ్యర్థి కన్నాకు దీటుగా నిలవాలంటే అక్కడ రాయపాటి సాంబశివరావు అండ తప్పదని వైసీపీ హై కమాండ్ భావిస్తోందని చెబుతున్నారు.  అందుకే ఆయనకు లోక్ సభ, ఆయన కుమారుడికి అసెంబ్లీ   సీట్లు ఇచ్చేందుకు వైసీపీ రెడీ అయ్యిందని అంటున్నారు.  దీంతో జగన్ ప్రాపకం కోసం విపక్ష నేతలపై ఎంతగా నోరు చేసుకున్నా పాపం అంబటి రాంబాబుకు నియోజకవర్గం మారకతప్పని పరిస్థితి ఎదురైందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.