వెలగపూడిని దెబ్బకొట్టేందుకు వైసీపీ కుయుక్తి.. ఓట్ల గల్లంతు

Publish Date:Jul 23, 2023

Advertisement

 ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలి.. సామ దాన దండోపాయాలను ఉపయోగించి అయినా మళ్ళీ అధికారం పీఠంపై కూర్చోవాలి. ఇదీ ఇప్పుడు ఏపీలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఇందుకోసం కంకణం కట్టుకున్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కకు పెట్టేసి బడుగు బలహీన వర్గాలకు పప్పు బెల్లాలు పంచుతూ అవే ఓట్టుగా మారుతాయని భావిస్తున్న జగన్  సామజిక వర్గాల వారీగా, మత ప్రాతిపదికన కూడా గాలమేసి పట్టుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీని దెబ్బతీసే మరికొన్ని ప్రయోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన అంశం.. రాష్ట్రంలో భారీ ఎత్తున ఓట్ల గల్లంతు.. ఓట్ల బదిలీ. ఈ అంశంపై ప్రతిపక్షాలు భారీగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కీలకమైన, టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఇందుకు ఉదాహరణ విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2009లో ఏర్పాటైన ఈ  నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకూ టీడీపీనే గెలుస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్థానంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లూ టీడీపీయే గెలిచింది. ఈ మూడు సార్లూ కూడా ఆ నియోజకవర్గం నుంచి  వెలగపూడి రామకృష్ణబాబే గెలిచారు. టీడీపీ కఠిన పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఎదురు నిలబడే రామకృష్ణ బాబుకు ఆయన నియోజకవర్గంలో కూడా అదే పేరుంది. అందుకే ఆయన ఓటమి అనేది ఎరుగరు. నిజానికి ఆయనది విశాఖ జిల్లా కూడా కాదు. ఎక్కడో విజయవాడ నుంచి విశాఖకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న ఆయన నందమూరి బాలకృష్ణకు ఆప్తుడిగా పేరుంది. బాలయ్య సిఫార్సు మేరకే 2009లో తొలిసారి సీటు దక్కించుకున్నారు.

బాలకృష్ణ సిఫార్సు అయితే చేశారు కానీ ఎన్నికలలో గెలిచింది మాత్రం ఆయనే. 2009లో ప్రజారాజ్యం పార్టీ భారీగా ఇక్కడ ఓట్లు చీల్చినా వెలగపూడి తట్టుకొని నిలబడ్డారు. ఆ తర్వాత 2014లో ఆయనకు ఏపీలో రెండవ అతి పెద్ద మెజారిటీ దాదాపుగా 47 వేల పై చిలుకు వచ్చిందంటే ఆయన ఛరిస్మా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక, 2019లో జగన్ ఒక్క ఛాన్స్ వేవ్ లో కూడా తట్టుకొని నిలబడిన వెలగపూడి.. అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ దాడి చేసే సమయంలో.. వెలగపూడి చంద్రబాబు ముందు నిలబడి సవాల్ విసిరి తన గౌరవాన్ని మరింత పెంచుకున్నారు. అందుకే వైసీపీ కన్ను ఈ స్థానంపై పడింది. చట్టబద్దంగా అయితే ఈ నియోజకవర్గాన్ని ఏమీ చేయలేరు కనుక ఇక్కడ భారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్ల గల్లంతుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 వేలకు పై చిలుకు ఓట్లను తొలగించేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తన నియోజకవర్గంలో మొత్తం 40 వేల ఓట్లు గల్లంతు అయ్యాయని వెలగపూడి తీవ్రమైన ఆరోపణ చేశారు. 2019లో ఉన్న ఓట్లు ఇప్పుడు ఎలా మాయమవుతాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిని అధికారులు కూడా దృవీకరిస్తున్నారట. ఓట్లను తొలగించిన మాట వాస్తవేమని.. అయితే, తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నామని చెబుతున్నారట. దీంతో పాటు ఒకే కుటుంబంలో ఉన్న వారిని వేరు వేరు బూతులలోకి బదిలీ చేస్తున్నారట. ఇప్పటికే ఇలా ఓట్లు కోల్పోయిన వారు, బదిలీ అయిన వారు అధికారులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.