Publish Date:Mar 30, 2025
చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్ పి జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు
Publish Date:Mar 30, 2025
ఎపిలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లారణ స్థల మండలంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు, నాగలికి పూజ చేసి భూమిని దున్నారు
Publish Date:Mar 30, 2025
మనదేశం సెక్యులర్ దేశం. హిందువులు ముస్లింలు కల్సి మెల్సి చేసుకునే పండగలు అనేకం. షియాముస్లింలు చేసుకునే పీర్ల పండుగకు హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలకంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అవుతుంటారు. ఈ సంవత్సరం ఉగాది మరుసటి రోజే రంజాన్ రావడం విశేషం . కడప జిల్లాలో ఉగాది రోజు జరిగే క్రతువుకు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ. కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతీ ఏడాది ముస్లింలు పూజలు చేస్తారు. తెల్లారితే రంజాన్ ఉన్నప్పటికీ పూజలు చేసే ముస్లింల సంఖ్య ఏం తగ్గలేదు. భారీగా ముస్లింలు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.
Publish Date:Mar 30, 2025
పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.
ఆర్థిక బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. బంగారం దుకాణం యజమాని కృష్ణ చారి భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేశ్ లు ఆదివారం ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు స్థానికులు మొదటి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
Publish Date:Mar 30, 2025
ఉగాది పర్వ దినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. పండుగ పూట చేసిన తొలిసంతకం వల్ల 3,456 మంది కుటుంబాల్లో ఆనందం నింపింది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఈ కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రూ 38 కోట్లను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారు.
Publish Date:Mar 30, 2025
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దశ దిశ లేకుండా పోయిందని, రాష్ట్రం కళ తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకని విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ వే డుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కూటమి అధికారంలో రాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు.
Publish Date:Mar 29, 2025
విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో విశేష పూజలు, కార్యక్రమాలను నిర్వహించడానికి టీటీడీ సమాయత్తమైంది. ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది.
Publish Date:Mar 29, 2025
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చాడు.. ఇవన్నీ పురణాల్లో విన్నాం.. అయితే బెంగళూరులో దొంగలు బాహుబలి అవతారమెత్తి బస్టాండ్‌లకు బస్టాండులనే ఎత్తుకుని పోతున్నారంట.
Publish Date:Mar 29, 2025
కేవలం హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ, ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ పసిపాపకు ఆరోగ్యం బాగా లేకపోయినా.. ఆ పాప తల్లిదండ్రులకు వెంటనే గుర్తొచ్చే హాస్పిటల్ నీలోఫర్. ఆస్పత్రులు దేవాలయాలు, డాక్టర్లు దేవుళ్లు అన్న ప్రజల విశ్వాసం ఇటీవలి కాలంలో సన్నిగిల్లుతోంది.
Publish Date:Mar 29, 2025
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Publish Date:Mar 29, 2025
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు.
Publish Date:Mar 29, 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీరాముడు చిన్నబ్రేక్ వేశారు. శ్రీరామనవమి ఎఫెక్ట్‌తో ఒక మ్యాచ్ పోస్టు పోన్ అయింది. ఐపీఎల్ హైటెన్షన్ మ్యాచులతో ఉర్రూత లూగిస్తోంది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది.
Publish Date:Mar 29, 2025
తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు
అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది.
తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది.