ప్రభుత్వం కూటమిది.. రాజకీయం వైసీపీది!?

Publish Date:Jan 30, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. వారి తీర్పు మేరకు అఖండ మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అలా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి కూడా ఏడు నెలలు గడిచిపోయింది. పాలన సజావుగా సాగుతోంది. అభివృద్ధి పరుగులు పెడుతోంది. జగన్ ఐదేళ్ల హయాంలో క్షణంక్షణం భయపడుతూ బితుకు బితుకు మంటూ గడిపిన జనం ఇప్పుడు స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. తమ ఆస్తులకు భ్రదత లేదన్న భయం నుంచి బయటపడ్డారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతల సమస్య లేదు. అయితే ఇది మాత్రం సరిపోతుందా? అంటే ఏ మాత్రం సరిపోదంటున్నారు జనం. మరి వారేం కోరుకుంటున్నారు? జగన్ హయాంలో అడ్డగోలు దోపిడీలకు, కబ్జాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకు వచ్చి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. జగమెరిగిన కబ్జాదారులపై కూడా ఇప్పటి వరకూ కేసులు నమోదు కావడం లేదు. అలాంటి కబ్జాదారుల గురించిన సమాచారం ప్రభుత్వానికి తెలియదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం వారిపై కేసులు నమోదు చేయడానికి ఇసుమంతైనా సుముఖంగా లేదా? యంత్రాంగంపై ప్రభుత్వానికి పట్టు లేదా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. 

ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా ఉదంతమే నిదర్శనం. ఒక ప్రముఖ దిన పత్రికలో పెద్ది రెడ్డి భూ కబ్జాలపై, అటవీ భూముల ఆక్రమణలపై వార్తా కథనం వచ్చింది. ఆ కథనంలో  పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మాణం కోసం అటవీ భూములను ఎలా దోచుకున్నారో?, ఆ ఫామ్ హౌస్ కోసం అటవీ భూములలో రోడ్డు వేయడానికి మార్కెట్ కమిటీ నిధులను ఎలా మళ్లించారో విపులంగా వివరణ ఉంది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు ప్రభుత్వం పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మార్కెట్ కమిటీ నిధుల మళ్లింపుపై దర్యాప్తునకు ఓ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసిందిన. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్సరేటర్ లు ఈ కమిటీలో ఉన్నారు. ఇక్కడ వరకూ బానే ఉంది, కానీ అధికార పగ్గాలు చేపట్టిన ఏడు నెలల తరువాత, అదీ ఒక పత్రికలో పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అటవీ భూముల ఆక్రమణల గురించిన వార్త వస్తే తప్ప చంద్రబాబు సర్కార్ కు ఆ విషయం తెలియలేదా? ఇంత కాలం ఆ ప్రాంతంలో అధికారులుగా ఉన్న వారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎందుకు నివేదించలేదు. వారంతా పెద్దిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

అంతే కాదు పేరుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పాలనా యంత్రాంగం అంతా ఇంకా జగన్ మనుషులతోనే నిండిపోయి ఉందా?  జగన్ హయాంలో ఆయన అండ చూసుకుని దోపిడీలకు, కబ్జాలకూ పాల్పడిన పెద్దిరెడ్డి వంటి వారిని కాపాడటం కోసమే ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఒక్క పెద్ది రెడ్డి ఉదంతమే కాదు.. కొద్ది రోజుల కిందట వైఎస్ వెంకటరెడ్డి అనే జగన్ సమీప బంధువుకు నిబంధనలకు తిలోకాలిచ్చి మరీ  అధికారులు సున్నపురాయి గని లీజును కట్టబెట్టారు.  తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ తరువాత ఆ లీజును రద్దు చేశారనుకోండి అది వేరే విషయం. కానీ వరుసగా స్వల్ప వ్యవధిలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఉదంతాలనూ చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ కు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టే లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని లేకుంటే ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారడం తధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.