గన్నవరంపై వైసీపీ ఆశలు వదిలేసుకున్నట్లేనా?

Publish Date:Aug 27, 2023

Advertisement

నడమంత్రపు సిరి ఎక్కువ కాలం నిలవదనే సామెత అందరికీ తెలిసిందే. అదే రాజకీయాలలో అయితే అనుకోకుండా కలిసి వచ్చిన నాయకత్వ అవకాశం కూడా ఎక్కువ కాలం నిలవదు. ఈ మాట గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సరిగ్గా సరిపోతుంది. వంశీ ఏమీ విద్యార్థి స్థాయి నుండి ఎదిగిన నేత కాదు.. వాళ్ళ కుటుంబం కూడా రాజకీయాలలో ఉన్న దాఖలాలు లేవు. కానీ, దివంగత నేత పరిటాల రవి పుణ్యమా అని.. హీరో నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో ఈజీగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. స్వతహాగా తెలివితో పాటు కొంత ఆర్ధిక పుష్టి కూడా ఉండడం.. యువకుడు కావడంతో పార్టీ అధినాయకత్వం కూడా ఎంకరేజ్ చేసింది. కానీ, ఉన్న తెలివికి తోడు రాజకీయంగా కలిసి రావడంతో ఆ తెలివి కాస్త అతి తెలివిగా మారింది. రాజకీయంగా ఓనమాలు నేర్పిన పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని నోటికి వచ్చినట్లు దూషిస్తూ తానే హీరో అనుకుని చెలరేగిపోయారు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఆ పార్టీ బీఫామ్ కారణమే సంగతి మరచి ఆ పార్టీ పెద్దలను వ్యక్తిగతంగా కూడా తూలనాడారు. 

ప్రస్తుతం అనధికారకంగానైనా వైసీపీ ఎమ్మెల్యేగా  ఉన్న వంశీ.. వచ్చే ఎన్నికలలో అదే గన్నవరం నుండి వైసీపీ  అభ్యర్థిగా పోటీ చేయడం కూడా దాదాపు ఖాయమే. ఇంతవరకూ వంశీకి బాగానే కలిసి వచ్చినా ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అనే చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన స్థానికంగా ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్ధకంగా మారినట్లు కనిపిస్తుంది. గతంలో 2014, 2019 ఎన్నికలలో టీడీపీ నుండి గెలిచిన వంశీ స్థానిక వైసీపీ నేతలపై తీవ్రమైన దూకుడు ప్రదర్శించారు. అడ్డు తగిలిన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం.. అనుచరులతో బెదిరించడం వంటి చేష్టలకు పాల్పడ్డారని ఇప్పుడు ఆయనున్న పార్టీ వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా చెప్తున్నారు. అప్పట్లో  తెలుగుదేశం అధినాయకులు మందలించినా ఖాతరు చేసేవారు కాదన్న ప్రచారం కూడా ఉంది. అప్పుడు వంశీ వేధింపుల బాధితులైన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు గన్నవరంలో ఆయన నాయకత్వాన్ని సహించలేకపోతున్నారట.

ఇప్పటికే ఇక్కడ వైసీపీ ఇంచార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన యార్లగడ్డతో గత ఎన్నికలలో భారీగా ఖర్చు పెట్టించిన వైసీపీ ఇప్పుడు వంశీని చేర్చుకొని యార్లగడ్డను ముంచేసింది. ఈ క్రమంలోనే అతను టీడీపీలో చేరిపోయారు. అంతకు ముందు 2014 ఎన్నికలలో వంశీపై పోటీ చేసిన వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు కూడా ఇప్పుడు వైసీపీని వీడడం ఖాయంగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతున్నది. వంశీ నాయకత్వంలో పనిచేసేందుకు వైసీపీ కార్యకర్తలెవరూ ఇష్టపడడం లేదని దుట్టా బహిరంగంగా, బాహాటంగా చెప్తున్నారు. దుట్టా కూడా పార్టీని వీడితే నష్టమని భావించిన వైసీపీ అధిష్టానం మచిలీపట్నం ఎంపీ   బాలశౌరిని రాయబారానికి పంపింది. దుట్టా ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన బాలసౌరి.. దుట్టా వైసీపీకి విధేయుడని గన్నవరంలో పార్టీ విజయానికి పని చేస్తారని చెప్పుకొచ్చారు. 

కానీ భేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు మాత్రం మరోలా మాట్లాడారు. మూడు నెలల క్రితమే సీఎం జగన్ తనను పిలిచి నియోజకవర్గ పరిస్థితి గురించి అడిగారని.. అప్పుడే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా సీఎంకు చెప్పానని.. ఈరోజు కూడా బాలశౌరితో అదే విషయాలు చెప్పానని అన్నారు. వంశీతో కలిసి పనిచేస్తానని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కాస్త ముందో వెనకో ఆయన కూడా పార్టీని వీడడం ఖాయం అనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ వైసీపీలోనే ఉన్నా వంశీ కోసం పనిచేయరన్నది మాత్రం స్పష్టమైపోయిందని చెబుతున్నారు. అలాగే పార్టీలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నేతలు కొందరు యార్లగడ్డతో వెళ్లిపోగా.. ఉన్న వారు వంశీ కోసం పనిచేసే పరిస్థితిలో లేరు. దీంతో ఇప్పుడు వంశీతో ఆయనతో పాటు టీడీపీ నుండి వచ్చిన వారే కనిపిస్తున్నారు. గత ఎన్నికలలో 838 ఓట్లతో గెలిచి బయటపడిన వంశీ ఈసారి వ్యక్తిగత వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైతే గెలవడం అసంభవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.