వైసీపీలో అడుగంటిపోయిన గెలుపు ఆశ!

Publish Date:Sep 15, 2023

Advertisement

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, తదననంతర పరిణామాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులలో, నేతలలో అంతర్మథనం మొదలైంది. జగన్ భస్మాసుర హస్తం తన నెత్తినే కాకుండా మొత్తం పార్టీ నెత్తిన పెట్టేశారా అన్న అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రజా వ్యతిరేకతతో ఎన్నికలు ఎదుర్కోవడమే కష్టం అనిపిస్తున్న తరుణంగా, ఆ వ్యతిరేకత ప్రజాగ్రహంగా మారేందుకు చంద్రబాబు అరెస్టు ఉదంతం దోహదపడిందని వారు అంటున్నారు. సాధారణంగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా తదుపరి ఎన్నికలను ఎదుర్కొనేందుకు తన పాలనా కాంలో చేసిందేమిటో, మరో సారి అవకాశం ఇస్తే ఏం చేస్తాము అన్నది చెప్పుకుంటుంది. అయితే జగన్ మాత్రం తన పాలనను విధ్వంసంతో మొదలెట్టి.. ఆరాచకత్వంతో ముగించాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నదని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ జనంలో జగన్ ప్రభుత్వం పట్ల, ఆయన పాలన పట్ల వ్యతిరేకత మాత్రమే ఉండేది.. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో అది ఆగ్రహంగా  మారిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ ప్రజాగ్రహాన్ని తట్టుకోవడం కష్టమని, రేపు ఎన్నికల ప్రచారం కోసం వారి ముందుకు వెళ్లే సాహసం ఏ వైసీపీ కార్యకర్తా చేయలేని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయనీ వారు అంటున్నారు. ఇదంతా జగన్ స్వయంకృతాపరాధమేనని చెబుతున్నారు. 

చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ ను గమనించిన ఎవరికైనా సరే జగన్ వ్యక్తిగత ద్వేషంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఇట్టే అవగతమైపోతుందని అంటున్నారు. అందుకే ఇంత కాలం జగన్ ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. ఎందుకొచ్చిన గొడవ.. బయటకు వచ్చి నిరసనలు తెలిపితే కేసులంటూ వేధిస్తారు అంటూ ఆందోళనలకు దూరంగా ఉన్న జనబాహుల్యం.. చంద్రబాబు అరెస్టుతో ఏమైనా ఫరవాలేదు.. వీఆర్ విత్ బాబు అంటూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వైసీపీ శ్రేణులే వివరిస్తున్నాయి. వైసీపీ నాయకులే కాదు.. క్యాడర్ కూడా ఇక నుంచి పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న బావన వ్యక్తం చేస్తున్నారు. 

అన్నిటికంటే ప్రధానంగా స్కిల్ స్కాం జరిగిందని కానీ, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని కానీ జనం నమ్మడం లేదు. దీనిని కుట్రపూరితంగా, కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆయనపై మోపి.. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా అరెస్టు చేశారనీ, తాను అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యాను కనుక విపక్ష నేతపైనా ఎదో విధంగా అవినీతి బురద జల్లాలన్న ద్రోహపూరిత ఉద్దేశంతోనే జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్టు చేసిందని జనం భావిస్తున్నారు.  ఆ కారణంగానే రాజకీయాలకు అతీతంగా  దేశవ్యాప్తంగా చంద్రబాబుకు సంఘీభావం లభిస్తోంది. 

1984లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడు ఎంతగా ప్రజాగ్రహం వ్యక్తమైందో..ఇప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా అదే స్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది. అప్పట్లో లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలు బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వచ్చి ఎలా ఎన్టీఆర్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారో.. అదే విధంగా  ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముక్తకంఠంతో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాయి.  ఈ అరెస్టుతో జగన్ తన పతనాన్ని తానే శాశించుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంతే కాకుండా ఇంత కాలం జగన్ పార్టీలో కొనసాగిన తమ రాజకీయ భవిష్యత్ ను కూడా అంధకారబంధురం చేశారని అంటున్నాయి.  

అలాగే చంద్రబాబు అరెస్టుతో డోలాయమానంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తును కూడా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించడం ద్వారా  ఖరారయ్యేలా చేసింవది కూడా జగనేననీ అంటున్నారు.  మొత్తంగా వైసీపీలో అత్యధికులు ఇప్పుడు పార్టీకి సాధ్యమైనంత దూరంగా ఉంటే గెలుపు, ఓటమి విషయాలు తరువాత ప్రజాగ్రహానికి గురికాకుండా ఉంటామని, అదే చాలనీ భావిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఏమూలో మిణుకు మిణుకు మంటున్నట్లు ఉన్న గెలుపు ఆశ ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయిందన్న భావన వైసీపీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.