మూడొచ్చినా మొక్కుబడి తంతే!

Publish Date:Sep 15, 2022

Advertisement

ఇటు చూస్తే మూడు రాజధానులు. అటు చూస్తే సంక్షేమ పథకాలు, ఎటు పోవడమో అర్థం కాని పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దిక్కులు చూస్తున్నారు. నిజానికి, ఎటు వెళ్ళినా వైసీపీ నేతలకు అష్టమ దిక్కే దర్శన మిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మూడు రాజధానులు, సంక్షేమ మీటలు, ఏ అంశం మీద ఎన్నికలకు వెళ్ళినా, వైసీపీ ఓటమి ఇప్పటికే ఖారారై పోయిందనే అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే వుంది.

అయినా, ప్రజలు మాత్రం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.  ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కుంటున్న కష్టాల నుంచి బయట పడాలంటే, ఒకే ఒక్క మార్గం, ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిని ఒక్క ఛాన్స్ తోనే ఇంటికి పంపేయడమే అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానం లేదు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా నిజం ఏమిటో తెలుసు. అయితే, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడడం లేదు అనుకున్నట్లుగా, ముఖ్యమంత్రి ఒక విధమైన భ్రమల్లో ఉన్నారు. ఓ వంక రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని మళ్ళీ మరో మారు తెర మీదకు తెచ్చింది.  

గురువారం(సెప్టెంబర్15) నుంచి మొదలైన  శాసన సభ వర్షాకాల సమావేశాల్లోనే  మూడు రాజధానుల బిల్లును మళ్ళీ ప్రవేశ పెడతామని, మంత్రులు ఒకరి వెంట ఒకరు బింకాలుపోతున్నారు. సవాళ్ళు విసురుతున్నారు. అయితే, ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు చద్రబాబు నాయుడు, అసెంబ్లీని రద్దు చేసి మూడు రాజధానులకు ప్రజామోదం పొందాలని చేసిన సవాలు స్వీకరించేందుకు మాత్రం అధికార పార్టీకి ధైర్యం సరిపోవడం లేదు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీ మూడు రాజదానుల అంశాన్ని ఎక్కడా ప్రస్తావించ లేదు. అంతే కాదు, అమరావతే రాజధానిగా ఉంటుందని వైసీపీ ఎన్నికల పత్రంలో పేర్కొంది. ఆమేరకు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చింది.నిజంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులకే  కట్టుబడి ఉంటే చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా, అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పు కోరడమే సమంజమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు,అయితే, బింకాలు పోతున్న మంత్రులు మాత్రం, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా, అసలు విషయం తప్పింది ఇతర విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు.  మంత్రి ఆర్కే రోజా అయితే, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు పెడతామని చెప్పారు. సరే, గత ఐదారు నెలలుగా వైసీపే నేతలంతా అదే మాట చెపుతున్నారు. కానీ, చిత్రంగా మంత్రి రోజా,ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజలుకు మూడు రాజధానులు కావాలో లేదో అప్పుడు అర్ధమవుతుందని అన్నారు. నిజానికి రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలియాలంటే, ఒక కుప్పంలోనూ, ఒక పులివెందులలోనో కాకుండా,అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ మాత్రమే, కాదు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి, సామాన్య ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. కోరుకుంటున్నారు. అయితే, ఆ ధైర్యం లేకనే, వైసీపీ మంత్రులు అసలు సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  
అదొకటి అలా ఉంటే, కొద్ది కాలం క్రితం వరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా  సంక్షేమ పథకాలే తమను మరో మారు అధికార పీఠం ఎక్కిస్తాయనే భ్రమల్లో ఉన్నారు. అయితే ‘గడప గడపకు ...’ కార్యక్రమంతో ఆ భ్రమలు చాలా వరకు తొలిగి పోయాయని, రాజకీయ పరిశీలకులు,అధికార పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు.

నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా తత్త్వం బోధ  పడిందని, అందుకే ఆయన ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలపై చిర్రు బుర్రులాడు తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని అసలు సమస్య నుంచి తప్పించేందుకే, మరో మారు మూడు.. బిల్లును తెరపైకి తెచ్చారని. ఈ సమావేశాల్లో అసలు బిల్లు రాక  పోయినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. మరోవంక  కేంద్ర మంత్రి నారాయణ స్వామి, అసెంబ్లీ ఎక్కడుంటే అదే రాజధానని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది.. 40 శాతం పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదని తెలిపారు.

పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్ర రాజధానిని రాజకీయ పార్టీలు నిర్ణయించలేవని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఒక వేళ ముఖ్యమంత్రి ప్రస్టేజికి పోయి మళ్ళీ బిల్లు తెచ్చినా, పాత కథే  పునరావృతం అవుతుంది రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అది మొక్కుబడి తంతుగానే మిగులుతుందని అంటున్నారు

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.