గెలిచే చోటా భయమేనా?
Publish Date:Jun 21, 2022
Advertisement
ఎవరన్నా గెలవాలనుకుంటారు. రాజకీయాల్లో అధికారంలోకి రావాలనో, అధికారంలోనే వుండాలనో కృషి చేస్తారు. కచ్చితంగా గెలిచే అవకాశాలు వున్నప్పటికీ విపక్షాల భయంతోనో, అభ్యర్ధుల మీద నమ్మకం లేకనో అతి ప్రచారం, దొంగ మార్గాలను అనుసరించడం ఎక్కడైనా చూశామా? అదుగో అలాంటి చిత్రమైన స్థితిలో సాగుతోంది వైసీపీ! అవును. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వాస్తవానికి వైసీపీ వారికే గెలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే అక్కడ విపక్షం పోటీలో లేదు. బీజేపీ మాత్రమే పోటీలో ఉంది. ఆ పార్టీకి గెలిచే అవకాశాలు లేవని ఆ పార్టీ నేతలకూ తెలుసు. అయినా పోటీ చేయాలి చేస్తున్నాం అంతే అంటూ రంగంలోకి దిగింది. ప్రచారం ,చేసుకుంటోంది. అయినా ఆశ్చర్యంగా వైసీపీకి ఓటమి భయం పట్టుకుందనే అనాలి. అందుకే ఏకంగా ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తోంది. మర్రిపాడు మండలం, నందవరం గ్రామ సచివాలయ కార్యా లయంలో వైసీపీ నాయకులు బహిరంగ సభ నిర్వహించి వైసీపీకే ఓటు వేయాల ని గ్రామ ప్రజలచేత స్థానిక వైసీపీ నాయకులు ప్రతిజ్ఞ చేయించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. అక్కడ లక్ష ఓట్ల భారీ మెజారిటీతో తమ అభ్యర్ధులు గెలిచి తీరా లని వైసీపీ అధినేత, సీ.ఎం. జగన్ పార్టీ వర్గాలకు, నాయకులకు, మంత్రుల కు ఆదేశించారు. ఏమన్నా చేయండి అక్కడ మాత్రం అంత మెజారిటీతో పార్టీ గెలవాల్సిందే అని గట్టి నిబంధన పెట్టారు. హఠాత్తుగా లక్షకుపైగా మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. ఎంత గెలుపు గుర్రాన్ని పెట్టినా, గట్టి విపక్షం పోటీలో లేకున్నా మహానాయకుడిని సంతోషపెట్టాలంటే మన ఆనందా న్ని, సొమ్ముని కొంత త్యాగం చేయాలన్న గొప్ప ఆలోచనను పార్టీ వర్గాలు తూ.చ. తప్పక అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగానే నేతలు వాలంటీర్ల ద్వారా ఒక్కో ఓటరకు రూ. 5 వందల నుంచి రెండు వేల వరకు పంపిణీ స్తున్నారు. వైసీపీ డబ్బుల పంపిణీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. గత సంప్రదాయం ప్రకారం టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపలేదు. విక్రమ్ రెడ్డిపై బీజేపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 13 మంది పోటీలో ఉన్నారు. లక్ష మెజారిటీ కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకున్నా మెజారిటీ సాధించడం అధికార వైసీ పీకి కష్టంగా మారిం ది. దీంతో వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించారు. ఖచ్చితంగా ఓట్లు పడతాయన్న ప్రాం తాల్లో ఐదువందలు, మరికొన్ని చోట్ల వెయ్యి, 15 వందలు పంపిణీ చేస్తున్నారు. బాగా క్లిష్టంగా ఉన్న చోట్ల ఓటుకు రూ. 2వేలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు, వాలంటీర్ల ద్వారా బహిరంగంగా డబ్బుల పంపిణీ చేపడు తున్నారు. మరోవైపు వైసీపీ నేతల డబ్బుల పంపిణీని అధికారులు పట్టించుకోవడంలేదు.
http://www.teluguone.com/news/content/ycp-cistributing-money-to-voters-in-atmakur-39-138151.html





