విజయసాయి చంద్రబాబు మనిషట!.. కొత్తరాగం ఆలపిస్తున్న వైసీపీ

Publish Date:Mar 13, 2025

Advertisement

విజయసాయికీ చంద్రబాబు మనిషి అన్న ముద్ర వేసేసింది వైసీపీ.  విజయసాయిరెడ్డి అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది జగన్ అక్రమాస్తుల కేసులు. జగన్ ఆస్తుల కేసులలో విజయసాయి ఏ2. అంటే జగన్ సహ నిందితుడన్న మాట. అటువంటి విజయసాయి వైసీపీ ఆవిర్భావం నుంచీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నేళ్ల వరకూ జగన్ తో కలిసి నడిచారు. జగన్ అధికార పతనంలో ఆయన ప్రమేయం ఉందో లేదో అన్న విషయం పక్కన పెడితే.. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం వెనుక కచ్చితంగా విజయసాయి ఉన్నారు. అంతే కాదు.. జగన్ కోసం ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రత్యర్థులపై చేసిన దాడి కూడా ఎవరూ మరచిపోలేరు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు.. అందుకు ఉపయోగించిన భాష వైసీపీ బూతు నాయకులు ఉపయోగించిన భాషను  మించిన రేంజ్ లో ఉండేది. అటువంటి విజయసాయి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసేశారు. ఇక రాజకీయాలకు దూరమని, వ్యవసాయమే తన వ్యాపకమనీ ప్రకటించి సంచలనం సృష్టించారు. 

ఆయన వైసీపీకి దూరం కావడం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన కుటుంబ ఆడిటర్ కూడా.  జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి, ఆయన కుటుంబంలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ వరకూ అన్నీ కూలంకుషంగా తెలుసు. అటువంటి విజయసాయి తనకు దూరమైనా, వ్యతిరేకంగా మారినా ఏమౌతుందో జగన్ కు తెలియనిది కాదు. అయినా విజయసాయి వైసీపీకి రాజీనామా చేస్తానని చెబితే జగన్  ఆపలేదు. పోనీ వెడితే వెళ్లాడులే అని మౌనంగానూ ఉండలేదు. విజయసాయి క్యారెక్టర్ లేని మనిషనీ, అటువంటి వాళ్లు వెళ్లిపోవడమే మంచిదన్నట్లుగా మీడియా ముందు చెప్పారు. జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు కూడా. విజయసాయి వైసీపీకి దూరమైన తరువాత జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. గతంలో అంటే తను వైసీపీలో ఉన్న సమయంలో షర్మిలపై చేసిన విమర్శలకు సారీ చెప్పారు. అవన్నీ జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ ను అయిష్టంగా చదవినవేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా షర్మిలే వెల్లడించి.. తన సోదరుడి నిజస్వరూపం ఇదీ అని చాటారు కూడా. 

ఆ తరువాత విజయసాయి విషయంలో జగన్ ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోవడంతో ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి విషయంలో మౌనమే మేలని జగన్ భావించి ఉంటారని అంతా భావించారు. అయితే కాకినాడ సీపోర్టు కేసులో ఏ2గా ఉన్న విజయసాయి.. జగన్ కు ఓ వైపు క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆయన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డిని పూర్తిగా ఇరికించేశారు. అదే సమయంలో వైసీపీ భవిష్యత్, జనన్ వైఖరీ, ఆయన కోటరీ తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఐడీ విచారణలో కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడేననీ, అన్నిటికీ మించి కాకినాడ సీపోర్టు యమజాని వైవీరావు, వైవీసుబ్బారెడ్డిల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో వైసీపీ అలర్ట్ అయిపోయింది. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శల పర్వానికి తెరతీసింది. వైసీపీకి వ్యతిరేకులపై ఆ పార్టీ నేతలు సంధించే తొలి ఆస్త్రం వారు చంద్రబాబు సానుభూతిపరులు, ఆయనకు అనుకూలురు అనే. గతంలో జగన్ తో విభేదించి ఆయన సోదరిపై వైసీపీ ఇవే విమర్శలు చేసింది. ఆమెను చంద్రబాబు సానుభూతిపరురాలిగా అభివర్ణించింది. ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు జగన్ పై విమర్శలు చేస్తున్నారంటూ నిందలు వేసింది. ఇప్పుడు విజయసాయిపైనా అవే విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.  

 విజయసాయి చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారంటూ ఆయనను చంద్రబాబు అనుకూలుడన్న ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నది. గతంలో జగన్ కోసం విజయసాయి చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన విమర్శలను, దూషణలను ఇప్పు డు ఉద్దేశపూర్వకంగా విస్మరించి.. విజయసాయిని చంద్రబాబు మనిషిగా చూపే ప్రయత్నం చేస్తున్నది.  

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.