ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రంగులు మారుస్తున్న వైసీపీ!

Publish Date:Feb 25, 2025

Advertisement

అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే ఊసరవిల్లి కూడా సిగ్గు పడేలా వైసీపీ తీరు ఉంది. నిన్నటి వరకూ తాము తిట్టిపోసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇప్పడు తమ వాడిగా సొంతం చేసుకుని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. నిన్న తిట్టిన వ్యక్తులనే నేడు పొగడ్తలతో ముంచేయడం, నిన్న కాదన్న విషయాన్నే నేడు ఔనంటూ గట్టిగా వాదించడం వైసీపీకే చెల్లిందన్నట్లుగా ఈ పార్టీ తీరు ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో ఇప్పుడు ఆ పార్టీ అదే చేస్తున్నది. 2023లో రజనీ కాంత్ విజయవాడలో  జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొన్నారు.ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, హదరాబాద్ ఐటీ హబ్ గా మారడానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. వాస్తవానికి రజనీకాంత్ నాడు చేసిన వ్యాఖ్యలలో రాజకీయం ఏ మాత్రం లేదు. కానీ చంద్రబాబు గురించి రెండు మంచి మాటలు చెప్పడమే వైసీపీకి కంటగింపుగా మారింది. దీంతో రజకీకాంత్ పై ఇష్టారీతిగా విమర్శలతో చెలరేగిపోయారు.   చంద్రబాబు పెంపుడు కుక్క అన్న స్థాయిలో  రజనీకాంత్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా బూతుల నాని అదేనండి కొడాలి నాని అయితే నోటికొచ్చినట్లు మాట్లాడారు. స్వయంగా సనీ నటి కూడా అయిన రోజా కూడా రజనీకాంత్ పై ఇష్టారీతిగా విమర్శలు చేశారు.  వీళ్లే కాదు వైసీపీలో చిన్నా చితకా నాయకులు కూడా రజనీకాంత్ పై నోరు పారేసుకున్నారు.  అటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు రజనీకాంత్ ను భుజాన వేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల కిందట రజనీకాంత్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్య అత్యవసరం అని నొక్కి చెప్పారు. ఇంగ్లీషు మీడియంలో చదవడం వల్ల వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ఆ మాటలను పట్టుకుని ఇప్పుడు వైసీపీ నేతలు రజకీకాంత్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్య అందించడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని అంటున్నారు.  ఇప్పుడు రజనీకాంత్ ఇంగ్లీషు మీడియంలో పిల్లలకు విద్య అంశంపై చేసిన ప్రసంగం వీడియో క్లిప్పింగులను తమ ప్రాచారం కోసం విరివిగా ఉపయోగించుకుంటున్నారు. 

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించలేదు. ఆ మాటకొస్తే ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీషు మీడియంను తొట్టతొలి సారిగా ప్రవేశ పెట్టింది చంద్రబాబునాయుడే. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను పరిచయం చేసింది చంద్రబాబు నాయుడే. అయితే తెలుగును విస్మరించి పూర్తిగా ఇంగ్లీషు మీడియంకు మారడం అన్న విధానాన్నే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది.  విద్యార్థులకు ఇంగ్లీష్  తెలుగు మీడియంలలో  దేనినో ఒక దానిని ఎంచుకునే ఛాయిస్ ఇవ్వాలని మాత్రమే చెప్పింది.  అదే విధంగా ఇంగ్లీషు మీడియంకు పిల్లలు అలవాటు పడటానికీ, ఇంగ్లీషు మాధ్యమంలో ఉపాధ్యాయులు బోధన చేసేలా నైపుణ్యం పెంచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇంగ్లీషు మీడియంను దశల వారీగా అమలు చేయాలని చెప్పింది. వాస్తవం అలా ఉంటే వైసీపీ మాత్రం నాడు తాము దుయ్యబట్టిన రజనీకాంత్ మాటలను తమ అధినేత జగన్ ను సమర్ధిస్తున్నాయని చెప్పుకుంటూ నానా యాగీ చేస్తున్నది.  

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.