వైసీపీ బరితెగింపు..
Publish Date:Apr 9, 2021
Advertisement
దేశం లో నైనా రాష్ట్రము లోనైనా. పాలక పక్షం ఉండాలి. ప్రతిపక్షం కూడా ఉండాలి. అది రాయకీయంలో అయినా.. రౌడీ ఇజమైన, ఆటైనా, వేటకైనా ప్రతిపక్షం తప్పక ఉండాలి. ఎందుకంటే పాలక పక్షం తప్పును ఎత్తిచూపేది ప్రతిపక్షమే కాబట్టి. అసలు ప్రతిపక్షమే ఉండొద్దు అనుకుంటే. అది రాజకీయం కాదు రాచరికం అవుతుంది. ఎప్పుడో సమాధి కట్టిన రాచరికాన్ని మళ్ళీ ప్రాణం పోస్తుందనే చెప్పాలి వైసీపీ ప్రభుత్వం. ప్రాంతం ఏదైనా సరే భయ పెట్టడం వారి నైజం. దాడులు చేయడం వారి ఇజం గా మారింది వైసీపీ తీరు. ఏపీలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నారు .
ఓపెన్ చేస్తే.. అది కిర్లంపూడి మండలం. కృష్ణవరం గ్రామం. సమయం అర్ధరాత్రి. ఆ ఊరిలోని జనం అంత నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా ఒక ఇంట్లో అరుపులు వినపడుతున్నాయి. ఓ పార్టీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కర్రలతో, ఇనుపరాడ్లతో మరో పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు.
కట్ చేస్తే.. అది కృష్ణవరం గ్రామం టీడీపీ నాయకుడి ఇల్లు. కొంత మంది వైకాపా నాయకులు దాడి చేశారు. తమపైకి దాడికి వస్తున్నారన్న విషయం తెలిసింది. తెదేపా కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ప్రాణాలను రక్షించుకున్నారు. అక్కడితో ఆగని వైకాపా కార్యకర్తలు. రాళ్లతో, కర్రలతో తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటి కిటికీలను, తలుపులు, ఫర్నీచర్‌ను పగలగొట్టారు. అక్కడ ఉన్న నాలుగు మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న తెదేపా నాయకుడు జ్యోతుల నెహ్రూ అర్ధరాత్రి 1.30 సమయంలో కృష్ణవరం చేరకుని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచే జిల్లా ఎస్పీ, పెద్దాపురం డీఎస్పీలకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని వివరించారు. ప్రశాంతమైన జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కృష్ణవరంలో జరిగిన ఘటనే నిదర్శనమని నెహ్రూ పోలీసు అధికారులకు వివరించారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న గ్రామానికి చెందిన గోరకపూడి గోపీనాథ్ ఆధ్వర్యంలో దాడి జరగడం హేయమైన చర్యగా నెహ్రూ అభివర్ణించారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు. కేసు ను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పలరాజు తెలిపారు. గ్రామంలోని ముఖ్య కూడలి ఉంది. ఆ కూడలిలో వైకాపా కార్యకర్త చాగంటి రాజారావు ద్విచక్ర వాహనానికి తెదేపా కార్యకర్త రాయవరపు దుర్గాప్రసాద్ ద్విచక్ర వాహనం అడ్డువచ్చిందంటూ బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఘర్షణ పడ్డారు. 11 గంటల సమయంలో వైకాపా కార్యకర్త చాగంటి రాజారావు, బూర్రేడి వీరబాబు మోటారు సైకిల్‌పై గ్రామ తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటి ముందు నుంచి పాతకృష్ణవరం వెళ్తుండగా తెదేపా కార్యకర్తలు వారిని అడ్డగించి దాడిచేశారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది వరకు తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటిపై దాడికి దిగారు. గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
http://www.teluguone.com/news/content/ycp--attack-on-tdp-village-leader-39-113405.html












