పవన్ కల్యాణ్ క్లారిటీతో వైసీపీ నేతల్లో గాభరా

Publish Date:Jan 15, 2023

Advertisement

పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.   అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు తన గౌరవానికి భంగం కలగనంతవరకూ పొత్తులతోనే ముందుకు వెళతానన్న స్పష్టత ఇచ్చేశారు. అంటే తెలుగుదేశం, జనసేనలు వచ్చే ఎన్నికలలో కలిసే వెళతారన్నది స్పష్టమైపోయింది. ఇక ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లెం ఆశతోనే అని ఆయనకు ఎంత వరకూ అర్ధమైందో తెలియదు కానీ.. ఆయన పార్టీలోని నాయకులకు మాత్రం స్పష్టంగా అర్ధమైంది.

అందుకే జగన్ పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని, గెలుస్తామనీ పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే యత్నాలు చేస్తున్న.. మనసులో ఆందోళన ఉన్న పైకి అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నా..  పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఎలాంటి కదలికా రావడం లేదు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు.  నిజంగా ప్రతి గాడకు మేలు జరిగిందే నిజం అయితే, గడపగడపలో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. నిజంగా మనం మేలు చేస్తే ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ పార్టీ నేతలూ, కార్యకర్తలు గొణుక్కుంటున్నారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని, చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని భూతద్దంలో చూపించి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం  కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన  నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని, 175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం  గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు.

అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం, అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు, తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు. నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం  భరోసా కనిపించడం లేదు. గతంలో,  అభ్యర్ధి ఎవరైనా,  `అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!  అని  అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు  ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉంది పోతున్నారు.

జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన  కార్యకర్తఃలు చాలా వరకూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.  98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డానం చేయించానన్నట్లు ఉందని  సొంత పార్టీ అధినేతపైనే సెటైర్లు వేస్తున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని, నేతలను నడిరోడ్డు మెదే నిలదీస్తున్నారు. 

అలాగే, కులం, మతం ఇతర కారణాలతో ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తఃలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగించి ఎమీ లేదని, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు. ఇక ఇప్పుడు ఏం చేసినా చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడమేనని అంటున్నారు. కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే..  పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి జ్వలిస్తోంది. ఇంత కాలం అణచిపెట్టుకున్న అసంతృప్తి ఇప్పుడు   భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలో తూటా దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. 
ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మానుగుంట మహీధర్రెడ్డి,  గుంటూరులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తాడికొండ ఉండవల్లి శ్రీదేవిచ  కర్నూలు ఎస్వీ మోహన్రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి రాయచోటి శ్రీకాంత్రెడ్డి గిద్దలూరు అన్నా రాంబాబు బాపట్ల కోన శశిధర్ శ్రీకాకుళం కిల్లి కృపారాణి పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

వీరంతా కూడా ఒకరిద్దరు మినహా అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం  కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొనితెచ్చుకున్నవారే.అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే.. ఇప్పుడు వీరికిప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వారికి మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధి లేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి.నిజానికి,  జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్ని వైసీపీ నాయకులూ కార్యకర్తలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు.  నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు ఊపందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటుందని, వైసీపీ ముఖ్య నేతలే   అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు   వెనకాడుతున్నారు. ఒక వేళ తీసుకెళ్లినా ప్రయోజనం ఏముంది అని మిన్నకుంటున్నారు. 

By
en-us Political News

  
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.