రంగురంగుల రంగస్థలం.. ప్రపంచ రంగస్థల దినోత్సవం..!
Publish Date:Mar 27, 2025

Advertisement
రంగస్థలం.. పేరు వినగానే రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఆ సినిమా స్టోరీ మొత్తం కళ్ల ముందు కదులుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నది రంగస్థలం సినిమా గురించి కాదు. అసలైన రంగస్థలం గురించి. ప్రజలకు కనువిందు చేసే థియేటర్ ప్రాముఖ్యత గురించి,ఈ థియేటర్ అనేది కేవలం సినిమానే కాదు.. నాటకరంగాన్ని, ఎన్నో రకాల షో లను కూడా ప్రజలకు పరిచయం చేసింది. ప్రతి సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రంగస్థలం గురించి, దీని చరిత్ర గురించి, రంగస్థలం అభివృద్ది చెందిన విధానం గురించి తెలుసుకుంటే..
రంగస్థలం అనేది మానవ స్వభావాన్ని వ్యక్తీకరించే సాధనంగా పనిచేస్తుంది. మానవ అనుభవాలు, భావోద్వేగాలలో ఉండే వైవిధ్యాలు, భావోద్వేగాలలో దాగిన విషాదం, సంతోషం, ఈర్ష్య, అసూయ, జాలి, దయ.. ఇలాంటివన్నీ లోతుగా పరిశీలించి, ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు రంగస్థలం కల్పిస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు.. విద్య, సామాజిక మార్పుకు కూడా శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
ప్రాముఖ్యత..
ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI) 1961లో ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రారంభించింది. మార్చి 27న పారిస్‌లో 1962లో "థియేటర్ ఆఫ్ నేషన్స్ సీజన్" నిర్వహించబడటంతో ఇది ప్రారంభం అయింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
రంగస్థల ప్రదర్శన కూడా గొప్ప కళారూపం. ఈ కళారూపాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు నాటక సమాజానికి మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి కృషి చేయడం. ఈ రోజున ప్రజలు అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, నాటక సమాజాలు కార్యక్రమాలు, అవార్డు వేడుకలు, ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా రంగస్థల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు.
రోజువారీ హడావిడి జీవితాలలో థియేటర్ అనేది ప్రజలకు కొద్దిసేపు అన్ని గోలలు మరచిపోయి కాస్త వినోదాన్ని, మరికొంద ప్రశాంతతను పంచే వేదిక. సాధారణ పౌరుడి నుండి విలాసవంతమైన జీవితం గడిపే వారి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో, సందర్భంలో ఈ థియేటర్ తో ముడి పడి ఉంటుంది.
ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు జరిగే కొన్ని కార్యకలాపాలు..
ప్రత్యేక థియేటర్ ప్రదర్శనలు..
చాలా థియేటర్లు ప్రత్యేక నాటకాలు , రంగస్థల ప్రదర్శనలను నిర్వహిస్తాయి. కొన్ని ప్రొడక్షన్స్ ప్రేక్షకులను థియేటర్‌తో నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించడానికి ఉచిత లేదా తగ్గింపు టిక్కెట్లను అందిస్తాయి.
అంతర్జాతీయ సందేశం..
ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటక రంగం ప్రముఖుడు ప్రపంచ నాటక దినోత్సవ సందేశాన్ని వ్రాసి అందజేస్తాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా పంచుకోబడుతుంది. ఈ సందేశం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నాటక రంగానికి ఉన్న శక్తిని తెలియజేస్తుంది. కళకు తమను తాము అంకితం చేసుకున్న వారు ఈ సందర్భంగా గుర్తించబడతారు. తగిన గౌరవం పొందుతారు. ఇది వ్యక్తి కళను ప్రపంచానికి మరింత విస్తృతం చేయడానికి సరైన మార్గం అవుతుంది.
థియేటర్ వర్క్‌షాప్‌లు, ప్యానెల్ చర్చలు..
థియేటర్ గ్రూపులు, సాంస్కృతిక సంస్థలు నటన, నాటక రచన, రంగస్థల కళపై వర్క్‌షాప్‌లు, చర్చలు, మాస్టర్‌క్లాస్‌లను నిర్వహిస్తాయి. నిపుణులు థియేటర్ పరిణామం చెందిన విధానం, ప్రాముఖ్యతపై తమ తమ అభిప్రాయాలు, నాటి రాలపు సంఘటనలు పంచుకుంటారు.
వీధి నాటకాలు, బహిరంగ ప్రదర్శనలు..
సామాజిక, సాంస్కృతిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వీధి నాటక బృందాలు బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తాయి. విశ్వవిద్యాలయాలు, నాటక పాఠశాలలు తరచుగా బహిరంగ ప్రదర్శనలను నిర్వహిస్తాయి.
నాటక కళాకారుల గుర్తింపు..
అత్యుత్తమ నాటక కళాకారులు, నాటక రచయితలు, ప్రదర్శకులకు కళారూపానికి చేసిన కృషికి అవార్డులు , గౌరవాలు ఇవ్వబడతాయి.
సోషల్ మీడియా , ఆన్‌లైన్ ప్రచారాలు..
థియేటర్ ను ఇష్టపడేవారు, సంస్థలు, కథలు, కోట్స్, మరచిపోలేని ప్రదర్శనలను పంచుకోవడానికి వరల్డ్ థియేటర్ డే వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తాయి. వర్చువల్ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రసారం చేయబడిన థియేటర్ ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పాల్గొనడానికి అనుమతిస్తాయి.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/world-theatre-day-35-195088.html












