ఆత్మహత్యలు వద్దే వద్దు!

Publish Date:Sep 10, 2023

Advertisement

మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు, కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని విజేతలుగా నిలిచినప్పుడు మనిషిగా పుట్టినందుకు చాలా సంతోషపడతాం. కేవలం అవి మాత్రమే కాదు జీవితంలో ఎంతో సంతోషకరమైన క్షణాలలో ఉన్నప్పుడు ఫలానా వారికి పుట్టినందుకు ఎంత సంతోషంగా ఉన్నామనో, ఈ జీవితం ఇలా సాగుతున్నందుకు మనం అదృష్టవంతులమనో అనుకుంటాం ఖచ్చితంగా. కానీ జీవితంలో చెప్పలేనంత విరక్తి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయించుకుని, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే?? ఎంతో గొప్పగా జీవించాల్సిన వాళ్ళు అర్థాంతరంగా జీవితానికి ముగింపు ఇస్తే!! ప్రస్తుత సమాజాన్ని ఎంతో భయపెడుతున్న విషయం ఇదే!! ఏ విషయాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు చాలామంది ఉంటున్నారు.

ఈ ఆత్మహత్యల మీద దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఆత్మహత్య చేసుకోవడం రాను రాను పెరుగుతున్న సమస్య. వీటి నమోదు సంఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమైన కథనాలు చెబుతాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8,00,000(ఎనిమిది లక్షల) మంది ప్రజలు మరణిస్తున్నారు.  కొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య పది లక్షలకు దగ్గరగా ఉంది.  

మరీ ముఖ్యంగా 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారి మరణానికి ఆత్మహత్య ప్రధాన కారణం అనే విషయం కలవరపెడుతోంది.  ప్రయత్నించే ప్రతి 40 మందిలో కనీసం ఒక్కరు అయినా చనిపోతున్నారు. మనిషి జీవించడానికి చాలా గొప్ప గొప్ప అవకాశాలు, మార్గాలు ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఎందుకు??

ఆత్మహత్యలకు ప్రధాన కారణం!!

ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే. మందులతో బాగు చేయలేని, ఇదీ అని నిర్ధారించలేని సమస్య అది. ఏమిటా సమస్య అంటే?? మానసిక అనారోగ్యం. మానసిక ఇబ్బందులతో బాధపడేవారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిలో అర్థం చేసుకునే ఆలోచనా స్థాయిలు తక్కువ. అతిగా ఆలోచించడం ఎక్కువ. ఈ కారణంగా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. 

ఏం చెయ్యాలి??

కౌన్సెలింగ్ ఇవ్వడం, సపోర్ట్ గా ఉండటం వల్ల  ఆత్మహత్యలను నివారించవచ్చు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని వారితో ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారికున్న సమస్యలను చెప్పుకునే స్నేహాభావాన్ని కలిగిస్తే దాదాపుగా ఆత్మహత్య అనే భావనను రానివ్వకుండా చేయచ్చు.   ఇతరులకు వారి జీవితాలకు బాధ్యత వహించడానికి, వారి జీవితానికి వారు ఇచ్చుకోవలసిన ప్రాధాన్యత, వారి మీద వారికి ఉండాల్సిన బాధ్యత మొదలైనవి గుర్తుచేయడం కూడా వారిలో ఆత్మహత్య ఆలోచనను రానివ్వకుండా చేయడానికి ఒక గొప్ప మార్గం.

ఆత్మహత్య అనేది అన్ని వయసుల వారిని సమానంగా ప్రభావితం చేస్తుంది.  అందువల్ల మానసిక ఆరోగ్యం గురించి చర్చలు జరపడం చాలా ముఖ్యం, ఇతరులు వారు ఎదుర్కొంటున్న కష్ట సమయాల గురించి మాట్లాడటం వల్ల అవసరమైతే వృత్తిపరమైన లేదా మానసిక ఆలోచనలకు సంబంధించిన సహాయం పొందడం సులభం చేస్తుంది.

'టేక్ ఎ మినిట్, చేంజ్ ఎ లైఫ్'

ఒక్క నిమిషం ఆగండి జీవితాన్ని మార్చుకోండి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేసిన ఒక గొప్ప వాక్యం. ఆత్మహత్యలు ఎప్పుడూ తొందరపాటుగా జరిగిపోతుంటాయి. అలాంటి సందర్భంలో ఒక్క నిమిషం ఆగి, జీవితం గురించి, భవిష్యత్తు గురించి, బ్రతకాల్సిన ఆవశ్యకత, జీవితానికి ముఖ్యమైన మార్గాలు వంటివి ఆలోచిస్తే జీవితం చెయ్యిజారిపోదనే విషయం అర్థమవుతుంది.

ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా ఈవెంట్‌లు, సమావేశాలు, సెమినార్‌లు చర్చా వేదికలను నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణకు కొత్త విధానాలను రూపొందిస్తారు.  వ్యక్తులలో జీవితం పట్ల అవగాహనను కలిగించడానికి సాధనంగా మీడియాను ఉపయోగించవచ్చు.  మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కుటుంబం, డాక్టర్ల కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది. 

సమాజ పౌరులుగా మన చుట్టూ ఉన్న వారికి మనవంతు సాయం చేయడం అనుసరించాల్సిన విషయమే!! కాబట్టి మీ వంతు మీరూ కృషి చేయండి. ఆత్మహత్యల నివారణకు తోడ్పాటు అందించండి.

                                  ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.