విధి రాత ఎవరూ తప్పించలేరన్న నానుడి ఆ మహిళ విషయంలో అతికినట్లు సరిపోతుంది. కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. సరిగ్గా అలాగే జరిగింది విశాఖకు చెందిన పూర్ణిమ అనే మహిళ విషయంలో. నక్కలపాలెంలో నివాసం ఉంటున్న ఎస్బీఐ ఉద్యోగి భార్య పూర్ణిమ తన ఇంటికి సమీపంలోనే ఉన్న బజారుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. . ఆమె వెడుతుండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి ఆమెపై పడింది.
దీంతో పూర్ణిమ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ఊహించని ఈ పరిణామంతో పూర్ణిమ కుటుంబ సభ్యులు విషాద సంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకూ తమతో నవ్వుతూ మాట్లాడి.. అంతలోనే ప్రమాదం బారిన పడి పూర్ణిమ మరణించిందంటూ భోరున విలపిస్తున్నారు. చాలా కాలంగా రోడ్డు పక్కన ఉన్న ఆ చెట్టు కొమ్మ ప్రమాదకరంగా వంగి విరిగిపడేటట్లుగా ఉన్నప్పటికీ జీవీఎంసీ సిబ్బంది పట్టించుకోలేదన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/women-died-due-to-tree--fall-25-197525.html
హైదరాబాద్లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.