లోకేష్ యాత్ర‌తో వైసీపీ సీన్ సితారేనా?

Publish Date:Sep 21, 2022

Advertisement

యాత్ర‌లంటే బామ్మ‌గారి తిరుప‌తి యాత్ర‌, కాశీయాత్రో అనుకునేవారు. కాల‌క్ర‌మంలో భ‌క్తిపూర్వ‌కంగానే కాదు, సామాజిక న్యాయం కోస‌మో, రాజ‌కీయ‌ల‌బ్ధికో ఒక యాత్రకు వెళ్ల‌డం చూస్తున్నాం. ఇపుడు  రాను రాను యాత్ర అంటే పాద‌యాత్ర‌లకే అధిక ప్రాధాన్యం ఏర్ప‌డింది. రాజ‌కీయ‌పార్టీల‌వారు అన్ని ప్రాంతా ల్లోనూ ప్ర‌జ‌ల‌కు త‌మ అజెండానో, మానిఫెస్టోనో తెలియ‌జేడానికి, ఓట‌ర్ల‌ను త‌మ‌వేపు తిప్పుకోవ‌డానికీ పాద యాత్ర‌లు చేప‌డుతున్నారు. వీటికీ రంగుమారి పాద‌యాత్రలే విజ‌య‌ర‌హ‌స్యాలు అన్న అభిప్రా యాలు స్థిరమైనాయి. ఒక్క పాద‌యాత్ర వీల‌యినంత దూరం చేస్తే రాజ‌కీయ‌భ‌విత‌ను మార్చే స్తుంద‌న్న గ‌ట్టి న‌మ్మ కం ఇపుడు రాజ‌కీయ‌పార్టీల అధినేత‌ల నుంచి మామూలు కార్య‌క‌ర్త‌కూ ఏర్ప‌డింది. 

ఏపీలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు కాపాడేందుకు, వారి ఆశ‌లు ఫ‌లించేలా చేయ‌డానికి, వారి వ్య‌ధ‌ల‌ను తొల‌గించ డానికి తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రాన్ని జే గ్యాంగ్ సంకెళ్ల నుంచి త‌ప్పించ‌డానికి ఆయ‌న కంక‌ణం కట్టుకున్నారు. ప్ర‌తీ ప్రాంతంలోనూ ప్ర‌జ‌లు వైసీ పీ పాల‌న ప‌ట్ల విముఖ‌త‌తోనే ఉన్నారు. ఇటీవ‌ల వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం ఘోరంగా విఫ‌లం కావ‌డం అందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌. మూడేళ్ల పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఇద‌మిద్ధం చేసిన మేలు అంటూ ఏమీ లేక‌పోగా హామీలు, ఉప‌న్యాసాలు, బోధ‌న‌లే ఎక్కువ‌య్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అభి వృద్ధి అనేది ఏరంగంలోనూ క‌నిపించ‌డంలేదు. పైగా విప‌క్షాల మీద దుర్భాష‌లాడుతూ విరుచుకు ప‌డ‌టం త‌ప్ప ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమీ లేదు. ఇది ప్ర‌జ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత బాగా గ‌మ‌ని స్తున్నారు. 

ప్ర‌శ్నించేవారిపై దాడులు చేప‌ట‌ట‌డం త‌ప్ప సంక్షేమప‌రంగా చేస్తున్న‌దేమీ లేదు.  ఈ ప‌రిస్థితుల్లో, నారా లోకేశ్ పాదయాత్రకు ముహూ ర్తం ఖరారైంది. నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు జనవరిలో శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నిజానికి అక్టోబర్ నుంచే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టాలని లోకేశ్ మొదట అనుకున్నారు. ఆ దిశగా కొంత కసరత్తు కూడా చేశారు. కానీ అంతర్గత చర్చల తర్వాత ఆ ముహూర్తాన్ని జనవరికి మార్చారు. ఎన్నికల వాతావరణం నెలకొన్నతర్వాత చివరి ఏడాదిలో పాదయాత్ర చేస్తే వ్యూహాత్మకంగా కలిసివస్తుం దని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.

వచ్చే జనవరిలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తే ఆపై ఏడాది మార్చి నాటికి మొత్తం 450 రోజుల సమ యం ఉంటుందని టీడీపీ నేతలు లెక్కగట్టారు. 2024 మార్చి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉం ది. అప్పటికి రాష్ట్రం మొత్తం పాదయాత్ర పూర్తవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారు. రాయలసీమ నుంచి ప్రారంభ మయ్యే లోకేశ్ పాదయాత్ర ఉత్తరాంధ్రలో ముగుస్తుంది. వీలున్నంత వరకూ ఏపీలోని అన్ని ప్రాంతాలనూ లోకేశ్ పాదయాత్ర స్పృశించేలా రూట్ మ్యాప్ను టీడీపీ నేతలు రూపొందిస్తున్నారు.

వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడు వారంలో రెండు రోజులు విరామం ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరు కావలసి ఉండడంతో ఆ రోజుతో పాటు మరో రోజు కూడా విశ్రాంతి తీసుకుని ఐదు రోజులు మాత్రమే జగన్ నడిచేవారు. అయితే.. తనకు కోర్టు హాజరు సమస్య లేదు కాబట్టి వారంలో ఏడు రోజులూ పాదయాత్ర చేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్ని హితవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి పక్ష నేతగా పాదయా త్ర  చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ పాదయాత్ర చేసిన చివరి ప్రతి పక్ష నేత చంద్రబాబు. జగన్ పాదయాత్ర సమయానికి రాష్ట్రం విడిపోవడంతో ఆయన ఏపీలో మాత్రమే నడిచారు. ఈసారి టీడీపీ తరఫున పాదయాత్ర చేసే అవకాశం లోకేశ్ కు వచ్చింది.

ఏపీలో నెలకొన్న వివిధ అంశాలపై తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూర మైన వర్గాలను దరి చేర్చుకోవడానికి.. ప్రజావ్యతిరేక వైసీపీ పాలనను తూర్పారబట్టేందుకు పాద యాత్రే సరైన సాధనమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా విస్తరిస్తున్నా ఆ స్థాయిలో మరికొన్నిచోట్ల పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరగలేదని, అలా వేగం పెరగడానికి పాదయాత్ర దోహదం చేస్తుం దని అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక తకు ప్రభంజన రూపం తేవాలంటే ఒక చోదకశక్తి అవసరం. లోకేశ్ పాదయాత్ర అలా ప్రభం జనం తీసుకొ స్తుం దని టీడీపీ నేతలు, శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.