విడదల రజని మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటేనా?

Publish Date:Feb 22, 2023

Advertisement

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  జగన్.. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అంటూ పక్కాగా క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారని ఆ పార్టీ శ్రేణుల్లో  జోరుగా హుషారుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో జగన్ తన కేబినెట్‌ను మరోసారి  పున్వ్యవస్థీకరిస్తారనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది. 

ఈ సారి పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన  కేబినెట్‌లో కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక అయ్యే వారికీ చోటు కల్పిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలా చోటు దక్కే వారిలో  చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్‌ కచ్చితంగా ఉంటారని చిలకలూరి పేటలో పార్టీ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మర్రి రాజశేఖర్ పార్టీ కోసం, జగన్ అధికారంలోకి రావడం కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డారని అంటున్నారు. ఈ విషయంలో   ఆయన వర్గీయులే కాదు, ఆయన ప్రత్యర్థి వర్గం అయిన మంత్రి విడదల రజినీ వర్గంలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. 

మరో వైపు జగన్ కేబినెట్‌లో మర్రి రాజశేఖర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అంటే జగన్ తొలి కెబినెట్‌లో కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. కానీ ఆ తర్వాత..  జగన్ తన కెబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా  కొడాలి నానిని పక్కన పెట్టడంతో.. ఆ సామాజిక వర్గం వారికి కేబినెట్ లో స్థానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జగన్ కెబినెట్‌లోకి మర్రి రాజశేఖర్‌ను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.   

అదీకాక.. 2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజినీని ఎమ్మెల్యేగా గెలిపిస్తే..మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపి.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకుంటానని విపక్ష నేతగా   జగన్ వివిధ సభా వేదికలపై నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విడదల రజినీ గెలవడం.. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయింది. మరి ఒకే నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరినీ కెబినెట్‌లోకి తీసుకుంటే...   తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే ఓ చర్చ పార్టీలోనే నడుస్తోంది.  అలాగని విడదల రజినీని మంత్రి పదవి నుంచి తప్పించి.. మర్రి రాజశేఖర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అంటే  పార్టీ శ్రేణుల నుంచి ఔనని కానీ కాదని కానీ బదులు రావడం లేదు. మర్రి రాజశేఖర్.. చాలా సాప్ట్‌గా ఉంటారని.. ప్రతిపక్ష పార్టీపైనే కాదు.. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గంపై కూడా ఆయన ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. కానీ విమర్శలు కానీ చేసిన దాఖలాలు అయితే లేవని ఆయన వర్గమే క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తోంది. అలాంటి వేళ.. మర్రి రాజశేఖర్‌కు కెబినెట్ బర్త్ గ్యారంటీనా అంటే అనుమానమే,

ఎందుకంటే.. ముఖ్యమంత్రి   జగన్  తన కేబినెట్‌  మంత్రులుగా ప్రత్యర్థి పార్టీల నేతలపై  వాడి వేడిగా చేయాలని ఆశిస్తారనీ, అలా ఘాటు విమర్శలు చేయగలిగిన వారినే మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఆ క్రమంలోనే తొలి కేబినెట్‌లో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబులను తీసుకున్నారని.. పునర్వ్యవస్థీకరణలో   అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా, విడుదల రజినీలకు చోటు కల్పించారని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.  మరి అలాంటి వేళ.. కామ్ గోయింగ్ పర్సన్ అయిన..  మర్రి రాజశేఖర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అదీ   పైర్‌బ్రాండ్ విడదల రజినీని తప్పించి అంటే  సందేహమే అంటున్నారు. అదే సమయంలో పలు వేదికలపై మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని జగన్ స్వయంగా ప్రకటించి మాట తప్పుతారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఒక వేళ మర్రి రాజవేఖర్ కు ఇచ్చిన మాట నిలుపుకోవాలని జగన్ భావిస్తే విడదల రజని మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోక తప్పదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.