బీహార్ బాబు నితీష్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?

Publish Date:Apr 11, 2025

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ సంవత్సరం  అక్టోబర్-నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగవలసి వుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. మరోవంక రాజకీయ పార్టీలూ ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి.  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ప్రధానంగా పొత్తులు, ఎత్తుల  గురించిన చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పొత్తుల పరంగా చూస్తే, అటు ఎన్డీఏలో ఇటు ఇండియా కూటమిలోనూ ఇప్పటివరకు అయితే 2020 పొత్తులలో మార్పు లేదు.   
అలాగే, ఇరు కూటముల నాయకులు, ముఖ్యంగా, మధ్యలో ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకిన, జేడీయు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఆ ‘తప్పు’ చేయనని స్పష్టం చేశారు. గత నెల (మార్చి) చివర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన సమయంలో నితీష్ కుమార్  షా సమక్షంలో  గతంలో రెండు సార్లు చేసిన తప్పు మరో సారి చేయనని, ఎన్డీఏను  వీడనని, స్పష్టం చేశారు. 

అలాగే  ఎన్డీఎ కూటమిమలోని ఇతర పార్టీల నేతలు  ఎల్జీపీ ( పాశ్వాన్) అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక) అధ్యక్షడు జితన్ రామ్ మాంఝీ కూడా ఎన్డీఎతో కొనసాగుతామని ప్రకటించారు. అంతే కాకుండా ఇటీవల బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్  ఎన్డీఏ నేతలతో ఢిల్లీలో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్  మీడియాతో మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ  ఎన్నికల్లో ఎన్డీఏ విజయం  పట్ల  విశ్వాసం ప్రకటించారు. అంతకుముందు పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగిన ఎన్డీఏ కార్యకర్తల సంయుక్త సమావేశంలో మొత్తం 243 సీట్లలో 225 ఎన్డీఏ గెలుచుకుంటుందని నాయకులు ప్రకటించారు.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల  రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఈ నెల 24 న  మూడు నెలల్లో రెండవ సారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు, మధుబనిలో జరిగే పంచాయతీ రాజ్ కార్యక్రమంలో పాల్గొని దేశంలోని పంచాయతీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే  పాట్నా విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. అంతకు ముందు  ఫిబ్రవరి 24న, ప్రధాని మోదీ భాగల్పూర్‌ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం  19వ విడత నిధులను విడుదల చేశారు. ఆ సందర్భంగా రైతులతో సంభాషించడంతో పాటు విమానాశ్రయ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు.

మరో వంక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేసే ఆలోచన లేదని  ఇండియా కూటమి  భాగస్వామ్య పార్టీలన్నీ ఒకటిగానే పోటీ చేస్తాయని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన నేపధ్యంలో  బీహార్ లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రచారం జరుగతున్న నేపధ్యంలో కాంగ్రెస్  నేతలు అలాంటి ఆలోచన లేదని స్పష్టత ఇచ్చారు. అయితే  ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సమిష్టి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ  ఆర్జేడీ మాత్రం  మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్  కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.  మరో వంక  రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన ఎన్నికల వ్యూహ కర్త  ప్రశాంత్ కిశోర్ ఇండియా కూటమితో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోది. ఆయన స్థాపించిన  జన సూరజ్ పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని ఎఐసీసీ కార్యదర్శి, బీహార్ రాష్ట్ర ఇంచార్జ్  దేవేంద్ర యాదవ్  అంటున్నారు. 

ఈ పరిణామాలను గమనిస్తే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్దానికి రంగం సిద్ధమైంది చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ- జేడీయు సారధ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-ఆర్జేడీ సారధ్యంలోని ఇండియా కూటమి సేనలు అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్దమవుతున్నారు. అయితే  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న కంటే.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నేకీలకంగా మారింది.  ఓ వంక ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.  మరో వంక నితీష్ కుమార్ మరో మారు ముఖ్యమంత్రి అవుతారా? అనే ప్రశ్న  రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవును  అయారామ్, గయారామ్ రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచిన బీహార్ రాజకీయాల్లోనూ నితీష కుమార్  తన  విలక్షణత నిలబెట్టుకున్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి గానే, కాదు, ఎక్కువ సార్లు  (9సార్లు)  ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగానూ చరిత్ర సృష్టించారు. నితీష్ కుమార్ 2005 నుంచి 2014 వరకు, తిరిగి   కొద్ది కాలం, ఆ తర్వాత  2015 నుంచి నేటి వరకు, మొత్తం మీద రెండు దశాబ్దాలకు కొంచెం అటూఇటుగా ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కు పోయారు. ‘ఫెవికాల్’ సిఎం’ అనిపించుకున్నారు.  అయితే  ఈ ఫెవికాల్ బంధం కొనసాగుతుందా? బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్  పదవ సారి  ప్రమాణ స్వీకారం చేస్తారా?  అనేది  ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. 
నిజానికి  2020 ఎన్నికల్లో ఎన్డీఎ 37.23 శాతం ఓట్లతో 125 స్థానాలు గెలుచుకుంది. అందులో నితీష్ కుమార్ పార్టీ జేడీయుకు వచ్చింది కేవలం 43 సీట్లు మాత్రమే.  బీజేపీ 74 స్థానాలు గెలుచుకుంది. అయితే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుగానే నితీష్ కుమార్ పేరును ప్రకటించినందున  నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీ  ఇచ్చిన  మాటకు  కట్టుబడి ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది. 

అయితే ఈసారి ముందుగానే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించేందుకు బీజేపీ అంత సుముఖంగా ఉన్నట్లు లేదు. అంటే ఎన్డీఎకి  మెజారిటీ వస్తే మహారాష్ట్ర తరహాలో  ఎక్కువ సీట్లు ఎవరికీ వస్తే వారికే ముఖ్యమంత్రి పదవి అనే ఫార్ములాను  బీహార్ లోనూ  అమలుచేసే ఆలోచనలో బీజేపీ ఉందని అనుకోవచ్చని అంటున్నారు. అయితే  ఇందుకు సంబంధించి బీజేపీ నాయకులను ప్రశ్నిస్తే.. కర్ర విరగదు, పాము చావదు, అన్నట్లు  "మేము ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తాము" అని సమాధానం ఇస్తున్నారు. మరో వంక ఇదే ప్రశ్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినప్పుడు, ‘ఇక్కడ’ చెప్పే విషయం కాదు అంటూ మీడియా ప్రశ్నను దాటవేశారు. సో.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి గత ఎన్నికల్లోలాగా ఎక్కువ సీట్లు కమల దళానికి దక్కితే.. ముఖ్యమంత్రి కుర్చీని వదులు కునేందుకు బీజేపీ సుముఖంగా లేదనేది స్పష్టంగానేతెలుస్తోందని అంటున్నారు. 

మరోవంక గతంలోనే  బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ, ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలనేది తన కోరిక అంటే, తాజాగా  నిన్న మొన్న మరో బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే.  నితీష్ కుమార్ ను  ఉప ప్రధానిగా చూడాలనేది తన కోరిక అని పార్టీ మనసులో మాటను బయట పెట్టారు. అంటే  నితీష్ కుమార్’కు, బీజేపీ ఢిల్లీ ఫ్లైట్  టికెట్ బుక్  చేసినట్లే అనుకోవచ్చని అంటున్నారు.  

అంటే  ఎన్డీఎ గెలిచినా, ఓడినా  నితీష్ కుమార్  కు మరో మారు  బీహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇంచు మించుగా లేనట్లే అంటున్నారు. అలాగే, నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠంతో ఉన్న ఫెవికాల్ బంధం...ఉంటుందా, ఊడుతుందా ? అంటే, అనుమానమే అన్న సమాధానమే వస్తోంది. అయితే.. హంగ్ వస్తే? మళ్ళీ నితీష్ కుమారే సిఎం అయినా కావచ్చు. ప్రస్తుతం అదే ఆసక్తికర ముక్తాయింపుగా పరిశీలకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.