మోడీ దౌత్యం యుద్ధాన్ని ఆపుతుందా?

Publish Date:Aug 27, 2024

Advertisement

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడం కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారా? ఆయన దౌత్యం ఫలించేనా? ప్రస్తుతం ప్రపంచ దేశాలలో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం  మోడీ  ఇటీవల స్వల్ప వ్యవధిలో రష్యా, ఉక్రేయిన్ లలో  పర్యటించి రావడమే. రష్యాలో పర్యటించిన ఆరు వారాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌  వెళ్లారు. దీంతో సహజంగానే ఆయన పర్యటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి భారతదేశం  ఎటూ మొగ్గు చూపకుండా వ్యవహరిస్తోందని ప్రపంచానికి చాటేందుకే కాకుండా మోడీ పర్యటనలు.. ఆ రెండు దేశాల మధ్యా యుద్ధాన్ని ఆపడానికి కూడా అని  ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ దౌత్య సంబంధాల విశ్లేషకుల వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.  మోదీ  శుక్రవారం (ఆగస్టు 23) కీవ్‌ వెళ్లి, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమీర్‌ జెలెన్స్కీతో  చర్చలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు, ఉక్రెయిన్‌తో భారత సంబంధాల మెరుగుదలపై కూడా ఆయన ఈ సందర్భంగా చర్చించినట్లు చెబుతున్నారు. రష్యా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ పై దాడి చేసిన తర్వాత భారతదేశం ఈ రెండు దేశాలకూ సమాన దూరం పాటిస్తూ వస్తోంది.

యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు, ఏ తీర్మానాన్ని ప్రతిపాదించినా భారతదేశం గైర్హాజర్‌ అవుతూ వచ్చింది. రష్యాను విమర్శించే తీర్మానాల విషయంలో కూడా మౌనం, దూరం పాటించింది.  పాశ్చాత్య దేశాల ఆంక్ష లను ఖాతరు చేయలేదు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు, ఆయుధాల సరఫరాలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో భారత్‌ పాశ్చాత్య దేశాల హెచ్చరికలు, బెదరింపులను లెక్క చేయలేదు.

జి-20 సదస్సులో తమకు కూడా స్థానం కల్పించాల్సిందిగా గత ఏడాది ఉక్రెయిన్‌ చేసిన అభ్యర్థ నను భారత్‌ తోసిపుచ్చింది. ఈ ఏడాది జూన్‌లో స్విట్జర్లాండులో జరిగిన శాంతి సదస్సుకు ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాన్ని పంపించడానికి కూడా భారత్‌  సుముఖత వ్యక్తం చేయలేదు. శాంతి పేరుతో భారత్‌ రష్యా కు వ్యతిరేకంగా నోరెత్తకపోవడం పట్ల ఉక్రెయిన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ సహజంగానే రష్యా యుద్ధం విషయంలో భారత్ తనకు మద్దతుగా నిలవాలని ఆశించింది. నిలుస్తుందని భావించింది.  అయితే భారత్ నుంచి అటువంటి స్పందన లేకపోవడం అటుంచి,  పుండు మీద కారం చల్లినట్టుగా మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం ఉక్రెయిన్‌ ఆగ్రహాన్ని మరింత  పెంచింది. 

ఈ నేపథ్యంలో రష్యా పర్యటన జరిగిన ఆరు వారాల తరువాత ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం అంతర్జాతీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  భారత  ప్రధాని ఉక్రెయిన్‌ను సందర్శించడం ఇదే  తొలి సారి. అదీ యుద్ధ సమయంలో భారత ప్రధాని ఉక్రెయిన్ పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అయ్యింది. ఉక్రెయిన్‌ పర్యటన సందర్భంగా ఈ ఇద్దరు నాయకులు యుద్ధం గురించి చర్చించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపం దగ్గర నివాళులర్పించారు.  మోదీ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య వ్యవసాయం, సంస్కృతి, వైద్య ఉత్పత్తులు, సామాజిక అభివృద్ధి పథకాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. అయితే అంతకు మించి అద్భుతాలేమీ జరగలేదు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆపేందుకు భారత్ కీలక పాత్ర పోషిస్తుందా లేదా అన్న దానిపై ఎటువంటి స్పష్టతా రాలేదు.  అయితే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య  శాంతి స్థాపన కోసం పరోక్ష ప్రయత్నాలకు ఎటువంటి ఢోకా ఉండదన్న సంకేతాన్ని మాత్రం మోడీ ఉక్రెయిన్ పర్యటన ఇచ్చింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.