పాయె.. ఆంధ్రా భవనూ పాయే.. అంతేనా?..అంతేనా?

Publish Date:Apr 27, 2023

Advertisement

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలై పోయింది. గత నాలుగేళ్లుగా ఆ పరిస్థితి మరింత దిగజారి పోయింది. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి రావాల్సిన వాటా తెచ్చుకోవడంలో..  ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. గతంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల రవాణా అంశంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకొన్న పరిణామాలు. అలాగే హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ భవనాలలో ఆంధ్రప్రదేశ్‌కి  వాటాను  కేసీఆర్ ప్రభుత్వానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే.. గిఫ్ట్ డీడ్‌లాగా అప్పగించేయడం.. దాంతో హుస్సేన్‌సాగర్ సమీపంలోని సచివాలయ భవనాలను కూల్చేసి.. వాటి స్థానంలో కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భవనం ఏఫ్రిల్ 30న కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభంకానుంది.  

అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ను పూర్తిగా తమకు వదిలేయాలని ఆంధ్ర్రప్రదేశ్ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు అనుకొని ఉన్న ఆ స్థలంతో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని ఈ సందర్భంగా ఆంధ్రా అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. అందుకు ప్రతీగా పటౌడీ హౌస్‌లో గల ఏడెకరాల పైచిలుకు స్థలాన్ని తీసుకొని.. అక్కడ కొత్త భవనం నిర్మించుకోవాలంటూ ఏపీ అధికారులకు వారు సూచించారు. అయితే ఈ అంశాన్ని తమ సీఎం జగన్‌తో చర్చించిన తర్వాతే తాము ఏ నిర్ణయం తెలియజేస్తామని తెలంగాణ అధికారులకు ఏపీ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. దీంతో ఇది కూడా.. త్వరలో ఏపీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల ఖాతాలోకి వెళ్లి పోయే పరిస్థితులు ఉన్నాయనే ఓ చర్చ సోషల్ మీడియాలో ఊపందుకొంది.  
తాజాగా ఢిల్లీలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఏపీ- తెలంగాణ భవన్, ఇతర స్థిరాస్తుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఈ భవనం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

 ఇప్పటికే టీటీడీ పాలక మండలిలో కానీ.. ప్రభుత్వంలో సలహాదారుల రూపంలో ప్రాంతాలకు అతీతంగా.. ఇబ్బడి ముబ్బడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నియమిస్తూ వస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న సంగతి తెలిసి కూడా ఆయన ఇలా వ్యవహరించడం పట్ల.. సర్వత్రా విమర్శులను ఎదుర్కొంటున్నారు. కానీ పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు.. పూర్తి విరుద్దంగా ఉంది. ఆయన ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్న ప్రపంచంలోని తెలుగు వారిలో ఉత్పన్నమవుతోంది. 

మరోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే.. కేంద్రం మెడలు వంచి... రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అన్నింటిని తీసుకు వస్తామంటూ 2019కి ముందు నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ..తన పాదయాత్రలో ఢంకాభజాయించి మరీ చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటి సాధనలో విషయంలో ఆయన అడుగులు   ముందుకు పడలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను, ఆయన మాటలను  నమ్మి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా.. ప్రతిపక్షనేతగా ఆయన ఇచ్చిన హామీలను.. ముఖ్యమంత్రి అయిన తరువాత నెరవేర్చడంలో జగన్ పూర్తిగా  విఫలమయ్యారనే చర్చ సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరి వాటి సాధనాలో భాగంగా  జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే.. సందేహమే అనే సమాధానం వస్తోంది. దీంతో అన్ని ఉన్నా .. కానీ అదేదో తక్కువైందన్నట్లుగా   జగన్   ప్రభుత్వ తీరు ఉందనే విమర్శలు సైతం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.