నాడు అందరి వాడు.. నేడు ఏకాకి.. మరో చాన్స్ దక్కేనా?

Publish Date:Nov 12, 2022

Advertisement

గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకుంటే.. రానున్న ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు ఫ్యాన్  పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోవాలి... ఇది ప్రస్తుత వైసీపీ అధిరుత, సీఎం  జగన్ టార్గెట్. ఆ క్రమంలో ఆయన టార్గెట్ 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గంలో భిన్నమైన వాదన వినిపిస్తోంది.

 గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో.... రాజన్న రాజ్యం తీసుకు రావడం కోసం.. తన కుమారుడుకి ఒక్క చాన్స్ ఇవ్వండంటూ ఆయన తల్లివిజయమ్మ ప్రజల్లోకి వెళ్లీ మరీ విజ్జప్తి చేశారు. అలాగే  జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం జగనన్న వదిలిన బాణమంటూ  షర్మిల పాదయాత్రే కాదు.. బై బై బాబు అంటూ బస్సు యాత్ర సైతం చేశారు. అలాగే   జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ.. టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు జోరుగా ప్రచారం సైతం నిర్వహించారు.
 
ఇక ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ చెందిన ఐ ప్యాక్... కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఏం చెబితే అది  జగన్ తు.చ తప్పకుండా పాటించి.. పాదయాత్ర సైతం చేశారు. ఆ క్రమంలో జగన్ పార్టీ 151 సీట్లలతో బంపర్ మెజార్టీతో గెలుపొందింది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత   జగన్ పెట్టుకొన్న టార్గెట్‌ను రీచ్ అవుతారా? అంటే సదరు వర్గం పెదవి విరుస్తోందని తెలుస్తోంది. అంతేకాదు అందుకు కారణాలు సైతం సదరు వర్గం సోదాహరణగా వివరిస్తుండడం మహా విశేషం.

 గతంలో అంటే 2019 ఎన్నికల వేళ.. జగన్ వెంటే అందరు అంటే తల్లి, చెల్లి, పులివెందుల్లోని ఫ్యామిలీ సభ్యులు, టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు ఉన్నారని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆ వర్గం  గుర్తు చేస్తోంది. అలాగే గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా కోడి కత్తి దాడి కేసు అయితేనేమీ.. సీఎం వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకా దారుణ హత్య కేసు అయితేనేమీ.. నాడు జగన్ పై సానుభూతికి దోహదం చేశాయి. అయితే నేటికీ వాటి దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటే.... ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని.. ఈ సంగతి తెలుగు ప్రజలకే కాదు... ఆయా కేసులు దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సైతం తెలుసునని ఆ వర్గం  పేర్కొంటోంది. అంతేకాదు.. సదరు కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో  ప్రజల కళ్లని సీఎం వైయస్ జగన్‌పైనే ఉన్నాయని చెబుతోంది.    అదీకాక.. ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ చెప్పిన దానికి.. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత చేస్తున్న వాటికి ఎక్కడ పొంతన అనేది లేకుండా ఉందని... సదరు వర్గం సోదాహరణగా వివరిస్తుంది.

జగన్ పరిపాలన విధానాలతో.. టాలీవుడ్‌లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా.. దాదాపుగా దూరమయ్యారు. మరోవైపు వైఎస్ ఫ్యామిలీలోని  అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప.. మిగిలిన వారంతా వైయస్ జగన్‌తో సాధ్యమైనంత మేర దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరకు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా జగన్ కు దూరం జరిగారు. పక్క రాష్ట్రం తెలంగాణకు తరలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ తరఫున ప్రచారం చేసే వారు.. ఎవరు అంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వేళ.. జగన్ అండ్ కోకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వైసీపీలోని  ఓ వర్గంలో  చర్చ వాడి వేడిగా నడుస్తోంది.

ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత..   జగన్ అందరినీ దూరం చేసుకుని.. ఒకే ఒక్కడుగా మిగిలిపోయారని సదరు వర్గం అభిప్రాయపడుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి ఎత్తులు, ఎత్తుగడలు వేస్తారోనని... ఇటు ప్రజలే కాదు.. అటు ఉమ్మడి కడప జిల్లా పులివెందుల్లోని  ఫ్యామిలీ సైతం.. టెన్షన్‌గా ఉందని ఆ వర్గం పేర్కొంటోంది. మరి వచ్చే ఎన్నికల వేళ.. వైయస్ జగన్ వెంట ఎవరు  వస్తారు.. ఎవరు నడుస్తారు అనే అంశం ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో ఓ చర్చ అయితే రచ్చ రచ్చగా సాగుతోన్నట్లు తెలుస్తోంది.  

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.