సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ.. చిరు హాజరుపైనే సర్వత్రా ఆసక్తి

Publish Date:Dec 25, 2024

Advertisement

అల్లు అర్జున్ అరెస్టు తదననంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొందరు సినీ ప్రముఖులు గురువారం ( డిసెంబర్ 26) ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీతో సమస్య పరిష్కారం అవుతుందా? లేక మళ్లీ కొత్తగా మొదలౌతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు సీఎం రేవంత్ తో భేటీకి వెళ్లే సినీ ప్రముఖులు ఎవరు? ఎంతమంది? అన్నదానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. అల్లు అర్జున్ అరెస్టు తరువాత వరుసగా జరిగిన సంఘటనలతో అసలు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోతుందా అన్న స్థాయిలో చర్చలు జరిగాయి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సినీ సెలబ్రిటీలు అరెస్టై మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి క్యూకట్టడాన్ని ఆక్షేపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించడానికి ముందుకు రాని సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి క్యూకట్టడం ఏమిటని నిలదీశారు. అసెంబ్లీ వేదికగానే  సినీ పరిశ్రమ తీరుపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక రాష్ట్రంలో   కొత్త సినిమాల విడుదలకు ప్రీమియర్ షోలకు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఉండవని కుండబద్దలు కొట్టారు. ఇది మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసేసింది. సంక్రాంతి  అంటేనే సినీమల సీజన్. అటువంటి కీలకమైన తరుణంగా సినిమాల టికెట్ ధరలు పెంపునకు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఉండవు అంటే సినీ పరిశ్రమ సంక్షోభంలో పడుతుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అయ్యింది. 

అయితే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ డీసీ చైర్మన్ గా నియమించిన దిల్ రాజు సంక్షోభ పరిష్కర్తగా, ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడమే కాకుండా, కొత్త సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.  ఆయన చొరవ వల్లే సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడానికి అంగీకరించారు. 

అయితే గద్దర్ అవార్డుల మార్గదర్శకాల విషయంలో సినీ పరిశ్రమ స్పందన పట్ల రేవంత్ లో ఆగ్రహం ఉంది. అలాగే గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఇచ్చిన గౌరవం, ప్రస్తుతం సీనీ పరిశ్రమ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికీ,  ముఖ్యమంత్రిగా తనకూ దక్కడం లేదన్న భావన కూడా రేవంత్ లో ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి తన వ్యాఖ్యలను ఖండించడానికే అన్నట్లుగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్నీ కాంగ్రెస్ తప్పుపడుతోంది. అన్నిటికీ మించి సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తరువాత అల్లు అర్జున్ స్పందించిన తీరు పట్ల సినీ పరిశ్రమ వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ రోజు సీఎంతో భేటీకి సీని దిగ్గజాలలో ఎవరెవరు హాజరౌతారన్న దానిపైనా క్లారిటీ లేదు. మెగా స్టార్ చిరంజీవి ఈ భేటీకి దూరంగా ఉండనున్నారని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదే జరిగితే.. ఈ భేటీ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అంటున్నారు. మొత్తానికి రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ సమస్య పరిష్కరిస్తుందా లేదా సమస్యను మళ్లీ కొత్తగా ప్రారంభమయ్యేలా చేస్తుందా చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.