మిషన్ 90 సక్సెస్ అవుతుందా?

Publish Date:Dec 31, 2022

Advertisement

మిషన్ 90  టైటిల్ బాగుంది. కానీ, కమల దళం నిర్దేశించుకున్న లక్ష్యం నెర వేరుతుందా? అంటే అదంత ఈజీ టాస్క్ కాదు. మరి అ విషయం కమలనాథులకు తెలియదా అంటే, తెలుసు. అయినా, మోడీ షా నాయకత్వంలో బీజేపీ  ఎప్పుడు, ఎక్కడ నేల చూపులు చుడదు. తలెత్తి చూసే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుంది తప్ప  తల దించుకుని చూసే అలోచన కార్యకర్తలలో రానీయదు. అవును, బీజేపీ విధానాలను కమ్యూనిస్ట్ శంఖంలో పోసి విశ్లేషించే ఒక మేధావి, మాజీ ఎమ్మెల్సీ అన్నట్లుగా, మోడీ షా  జోడీ నాయకత్వంలోని బీజేపీ, పులి మీద  స్వారీ చేసేందుకు ఇష్టపడుతుందే  కానీ  పిల్లి మీద స్వారీ చేయదు.  

పశ్చిమ బెంగాల్ లో జరిగింది అదే..  200 ప్లస్ టార్గెట్ గా ఎన్నికల బరిలో దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత షా, ఒకటికి వందసార్లు, బీజేపీ 200 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, వచ్చితీరాలని పార్టీ నాయకులు, కార్యకర్తల మెదళ్ల లో ఒక సెల్ఫ్ టార్గెట్ ను ఇంజెక్ట్ చేశారు. నిజమే,పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రకటిత లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ అప్రకటిత లక్ష్యాన్ని చేరుకుంది.

 కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా, సింగిల్ సీటు రాలేదు. బీజేపీ ఫిక్స్ చేసుకున్న  200 టార్గెట్ ను కాదు, ప్రశాంత్ కిశోర్ విసిరిన 100 సీట్ల ఛాలెంజ్ ని చేరుకోలేక పోయింది. అయినా  సింగిలే డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు చేరింది.  77 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకుంది. అంతకు ముందు 2016 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది కేవలం 3 అసెంబ్లీ సీట్లు, ఆ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు కేవలం 10.16 శాతం. అదే 2021కి వచ్చే సరికి, సీట్ల సంఖ్య 3 నుంచి 77కు పెరిగితే, ఓట్ల శాతం 10.16 నుంచి 38.13 శాతానికి చేరింది.  

అలాగని పశ్చిమ బెంగాల్ స్టొరీనే తెలంగాణలో రీపీట్  అవుతుందా అంటే, కావచ్చు, కాకపోవచ్చును. కానీ, హైదరాబాద్ శివారులో జరిగిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ  కన్వీనర్ల సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని, సిద్దం చేసుకున్న రోడ్ మ్యాప్ ను సింపుల్ గా తీసి పారేయడం సరికాదని  పరిశీలకులు భావిస్తున్నారు. అవును  బీజేపీ హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్ట్ మేథావులు కూడా  బీజేపీ సక్సెస్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ బెంగాల్ తరహా వ్యూహంతో పావులు కడుపుతోందని  మాత్రం  గట్టిగా నమ్ముతున్నారు.  
ఈ వ్యూహంలో భాగంగా కొత్త ఏడాదిలో పది  నెలల రోడ్ మ్యాప్ తో  వరుస కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతున్నది. పది నెలల రోడ్ మ్యాప్ లో మొదటి నాలుగు నెలలలో  రాష్ట్ర ప్రభుత్వ  వైఫల్యాలను జనంలో ఎండగట్టడంతోపాటు రాష్ట్రానికి కేంద్రం ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చిందో  ప్రజలకు వివరించనుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ పేరుతో పది వేల గ్రామ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీని హైదరాబాద్ కు ఆహ్వానించి, ఏడు లక్షల మంది బూత్ కమిటీ సభ్యులతో సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో  ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికను రెడీ చేసుకుంది. వీటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకురావాలనే ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది.  

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై  ఏప్రిల్ లో చార్జిషీట్ విడుదల చేయాలనుకుంటున్నది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించి భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నది. హైదరాబాద్ శివారులో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ, కన్వీనర్ల సమావేశంలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  చేసిన దిశా నిర్దేశంతో నేతలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా  బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాడాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని పార్టీ ప్రకటించింది.

సో.. చివరకు ఏమి జరుగుతుంది  అనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొనేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ను అష్టదిగ్బంధనం చేసి  రాష్ట్రానికే పరిమితం చేసే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. యాదృచ్చికమే కావచ్చును కానీ  ఎమ్మెల్యేల బేరసారాల కేసులో  కేసీఆర్ టార్గెట్ చేసిన బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  సారధ్యంలో బీజేపీ  కేసీఆర్ హటావో .. తెలంగాణ బచావో   వ్యూహరచన జరిగిందిని ఇకపై కూడా  మిషన్ 90 కి కర్త, కర్మ, క్రియగా ఆయనే వ్యవహరిస్తారని అంటున్నారు.అంతేకాదు,  బీఎల్ సతోష్  హైదరాబాద్ నడిగడ్డ నుంచే కేసీఆర్  కు సవాలు విసిరి వెళ్ళారు.  సో.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం ముందు ముందు మరింతగా రక్తి కడుతుందని, రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.