టీడీపీ, జనసేన తొడకొడుతున్నా వైసీపీలో చలనం లేదేంటి?

Publish Date:Jul 15, 2023

Advertisement

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రం ఎన్నికల ఏడాదిలో కి అడుగుపెట్టేసింది. సమయం దగ్గర పడే కొద్దీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై దండయాత్ర మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా చెప్తున్నాయి. బీజేపీ కూడా సమరానికి సిద్దమవుతున్నది. బీజేపీ జాతీయ నేతలు వచ్చిన ప్రతిసారి వైసీపీ ఫెయిల్యూర్ అని గంట కొట్టి  మరీ చెప్పి వెళ్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈసారి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి నారా లోకేష్ యువగళం పేరుతో  పాదయాత్ర చేస్తూ రెండు వేల కిమీ చుట్టేయగా రాయలసీమలో సైతం ఊహించని స్థాయిలో లోకేష్ పాదయాత్రకి ఆదరణ వచ్చింది. లోకేష్ రోజులు గడిచే కొద్దీ మాటలలో వేడి పెంచుతున్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయయాత్రతో కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే ఒక విడత వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా ఈ మధ్యనే రెండో విడత కూడా యాత్ర మొదలైంది. పవన్ అధికార పార్టీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే కట్టలు తెంచుకొనే ఆగ్రహం వ్యక్తం చేసే పవన్ తొలి విడత యాత్రలో ఆ నైజం పక్కన పెట్టగా.. రెండో విడత యాత్రలో ఆ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. సూటిగా జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి సంస్కార హీనులని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తెచ్చిన వాలంటీర్లు దేశద్రోహులకు సహకరిస్తున్నారంటూ భారీ ఆరోపణలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినా.. వార్నింగులు ఇచ్చినా వెనక్కు తగ్గక మరికాస్త డోస్ పెంచి వైసీపీని దుయ్యబడుతున్నారు.

ఇంకా చెప్పాలంటే.. పవన్, లోకేష్ భాషలలో చెప్పాలంటే.. జగన్ ఒక క్రిమినల్ అనీ, వైసీపీ అంటే జగ్గూభాయ్ గ్యాంగ్ అని, అసమర్ధ సీఎం జగన్, మరో హిట్లర్ జగన్, జగన్ అనే రౌడీ చేతులు రక్తంతో తడిసిపోయాయని పెద్ద పెద్ద బాంబుల లాంటి విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే జగన్ అనే వ్యక్తి మిత్రుడిగా కాదు శత్రువుగా కూడా పనికిరాడని తీసి పడేశారు. మరి ఇంతలా భీకరమైన మాటల దాడి జరుగుతూంటే వైసీపీ మాత్రం సైలెన్స్ మైంటైన్ చేస్తుంది. ఒకప్పుడు జగన్ ను ఒక్క మాట అంటే ఆ అన్న వారిని వైసీపీ నేతలు, శ్రేణులు ఎదురుదాడి చేసి చీల్చి చెండాడే వారు. వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని సైతం బజారుకీడ్చి నోటికి పనిచెప్పే వారు. కానీ ఇప్పుడు అవేవీ వైసీపీ నేతలలో కనిపించడం లేదు. దీంతో వైసీపీ ఎందుకు ఇలా మౌనంగా ఉంటుందన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నది.

పోయిన వాళ్ళు పోయినా.. వెళ్లగొట్టిన వాళ్ళను తీసేసినా ఇంకా వైసీపీలో 130కి పైగా ఎమ్మెల్యేలు యాక్టివ్ ఉన్నారు. వాళ్ళలో 30 నుండి 40 మంది సీనియర్లు కూడా ఉన్నారు. పాత మంత్రులు, కొత్త మంత్రులు ఓ 20 మంది వరకూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంపీలు, మాజీలు, సలహాదారులు, చైర్మన్లు, డైరక్టర్లు ఇలా భారీ సైన్యమే ఉంది. ఇంత మంది ఉండి కూడా వాళ్ల అధినేతని పట్టుకొని అన్నేసి మాటలు అంటున్నా ఒక్కరూ కదలడం లేదు.. మెదలడం లేదు. విజయసాయి, సజ్జల లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకురావడం లేదు. జగన్ ను ఒక్క మాట అంటే వంద వడ్డించే రోజా.. జగన్ కోసం ప్రాణం ఇస్తా ప్రాణం తీస్తా అనే కొడాలి నానీ, జీవితమంతా జగన్ కోసమే అని చెప్పిన ఒకరిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతున్నది? ఎందుకిలా అంతా కట్టకట్టుకుని మౌనవ్రతం పాటిస్తున్నారు అన్నది ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీస్తున్నది.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.