ఎందుకీ మౌనం.. షర్మిల విమర్శలపై తెరాస సైలెన్స్ కు కారణమేమిటి?

Publish Date:Sep 12, 2022

Advertisement

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కుమార్తె, అవశేష ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్  టీపీ పార్టీ స్థాపించి సంవత్సరం దాటింది. గత సంవత్సరం (2021) జులై 8 న, ఆమె పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు, ఆమె రాజకీయాల్లో కొంత క్రియాశీలంగానే  ఉన్నారు. అయినా ఇంకా పార్టీకి ఒక స్వరూపం, స్వభావం అంటూ ఏదీ ఏర్పడలేదు. నిజానికి, ఆమె పార్టీలో ఇతర నాయకులు ఎవరన్నా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఒక విధంగా షర్మిల సింగిల్ విమెన్ ఆర్మీగానే పార్టీని నడుపుతున్నారు. 

షర్మిలకు రాజకీయాలు కొత్త కాదు. రాజశేఖర రెడ్డి కుమార్తేగానే కాదు, జగన్ రెడ్డి సోదరిగానూ, ఆమె రాజకీయ ఆటు పోట్లను రుచి చూశారు. రాజశేఖర రెడ్డి ఉన్నంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించక పోయినా, ఆయన మరణం తర్వాత, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ, స్థాపించిన తర్వాత షర్మిల పార్టీ వ్యవహరాల్లో చురుకైన పాత్రను పోషించారు. నిజానికి ఈ రోజు ఏపీలో వైసీపీ అధికారంలో ఉందంటే అందుకు కొంతవరకు షర్మిల కుడా కారణం. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్ళిన సందర్భంలో అంతవరకు ఆయన సాగిస్తున్న పాదయాత్రను షర్మిల కొనసాగించారు. జగనన్న వదిలిన బాణం అంటూ దూసుకు పోయారు. ఒక విధంగా జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలల కాలంలో వైసీపీని విజయమ్మ చేదోడుగా షర్మిల బతికించారు. 

అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏమైందో ఏమో కానీ, అన్నా చెల్లీ మధ్య దూరం పెరిగింది. నిజానికి అన్నాచెల్లీ మధ్యనే కాదు, తల్లీ కొడుకు మధ్య కూడా దూరం పెరిగింది. ఈ నేపధ్యంలోనే షర్మిల నిరీక్షించినంత కాలం నిరీక్షించి, ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో కానీ, చివరకు జగన్ రెడ్డితో రక్త బంధాన్ని కాకపోయినా, రాజకీయ బంధాన్ని తెంచుకున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి చేరి, తెలంగాణలో, వైఎస్సార్ టీపీ ( వైఎస్సార్ తెలంగాణ పార్టీ) స్థాపించారు. 

అయితే ఆమె ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు ? అన్న జగన్ రెడ్డితో ఆస్తి  తగవో, రాజకీయ వివాదమో ఏదైనా ఉంటే,ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే, ఆమె పార్టీ పెట్ట వలసింది, అన్నతో పోరాడ వలసింది, ఏపీలో కదా? తెలంగాణ రాజకీయాలకు  పూర్తిగా గుడ్ బై చెప్పిన తెలంగాణలో పార్టీ పెట్టడంలో ఆమె ఉద్దేశం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అప్పుడూ ఇప్పుడు కూడా అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం వెనక,ఎ వరెవరిదో ప్రమేయం, ఏవేవో వ్యూహాలు ఉన్నాయని అనేక కథనాలు కూడా మీడియాలో వినిపించాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆమె పార్టీ వెనక అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు మొదలు తెరాస, బీజేపీ పార్టీల వరకు ఎవరి హస్తమో  ఉందని, అసలు జగన్ రెడ్డే, ఆమె వెనక ఉన్నారనే ప్రచారం కూడా  జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది.  

సరే, అదంతా  ఒకెత్తు అయితే, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన షర్మిల రాష్ట్రంలో అంచెలంచెలుగా  పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె అలా మూడు విడతల్లో కలిపి 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇంకా కొనసాగిస్తున్నారు.  అయితే, ఆమె పాద యాత్ర చేయడం ఒకెత్తు అయితే, పాద యాత్ర పొడుగునా ఆమె తెరాస ప్రభుత్వం పై కత్తులు దూస్తున్నారు. శూలాల్లా గుచ్చుకునే పదునైన బాణాలు సంధిస్తున్నారు. ముఖ్యమత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ వీళ్ళు వాళ్ళని కాదు, మంత్రులు తెరాస నాయకులు ఎవరినీ వదిలి పెట్ట కుండా, అందరినీ టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తీ గత విమర్శలూ గుప్పిస్తున్నారు. 

అయితే చిత్రం ఏమిటంటే, దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ సహా తమకు ప్రత్యర్ధులు అనుకున్న ప్రతి ఒక్కరినీ, పొట్టు పొట్టున ఎండగట్టే  తెరాస నాయకులు, ఆమె ఎవరని ఎంత  దూషించినా దుర్భాషలాడినా పెదవి విప్పడం లేదు. చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ ని దూషించినా తెరాస నాయకులు ఎవరూ ఆమె విమర్శలకు సమాధానం కూడా ఇవ్వడం లేదు. కొద్ది రోజుల క్రితం మంత్రి నిరంజన రెడ్డి నియోజకవర్గం వనపర్తికి వెళ్లి మరీ, మత్రిని, ముఖ్యమంత్రిని కలిపి, చాలా తీవ్రమైన విమర్శలు చేశారు.ఆ ఇద్దరిదీ మందు బంధమని, ఒకరు పోసే వారు ఒకరు తాగేవారు, అంటూ తీవ్ర ఆరోపణ చేశారు.గతంలో మంత్రి తనను  ఉద్దేశించి ‘మంగళవారం మరదలు’ అంటూ చేసిన వ్యాఖ్యలకు, అప్పుడే ఆయన క్షమాపణలు చెప్పినా, వదలకుండా ‘ఎవడ్రా మరదలు, చెప్పు దెబ్బలు తింటావ్’ అంటూ ఘాటుగా మండిపడ్డారు.అయినా, మంత్రి సహా తెరాస నాయకులు ఆ స్థాయిలో రీయాక్ట్ కాలేదు. అందుకే అందరినీ ఎండగట్టే కేసీఆర్, కీటీఆర్ సహా తెరాస నాయకులు ఒక్క షర్మిల విషయంలో మాత్రమే ఎందుకు, ‘మర్యాద’ పాటిస్తున్నారు? అంటే, షర్మిల వలన తెరాసకు వచ్చే నష్టం ఏమీ ఉండదు.

ఆమెకు ఓట్లే తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు. ఒక వేళ ఒకటో రెండో సీట్లు వచ్చినా, గతంలో జగనన్న పార్టీ వైసీపీ టికెట్ పై ఖమ్మం జిల్లానుంచి గెలిచిన ఒక ఎంపీ,  ఒకరో, ఇద్దరో ఎమ్మెల్ల్యేలకు గులాబీ కండువా కప్పినట్లే ఆ ఒకరిద్దరిని కుడా తమ గూటికి తెచ్చుకోగాలమనే ధైర్యం కావచ్చును, ఆమె విమర్శలను అంతగా పట్టిచుకోవడం లేదని అంటున్నారు. అలాగే, ఆమెకు వచ్చే ఓట్లు కూడా, తెరాస వ్యతిరేక ఓట్లే. అంటే  ప్రతిపక్ష ఓటును షర్మిల చీల్చి పరోక్షంగా తెరాసకే మేలు చేస్తారు. అందుకే., ఆమె తిట్లను, విమర్శలను తెరాస నాయకులు  దీవెనలుగా తీసుకుంటున్నారని, అంటున్నారు. ఎంతవరకు నిజమో ఏమో కానీ, ఆమె పాదయాత్రకు స్పాన్సర్లను స్పాన్సర్ చేసింది కూడా .. తెరాస నాయకులే అని,అంటున్నారు.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.