చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ మౌనం..తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహం

Publish Date:Sep 14, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగనుందన్న ఉత్కంఠ  సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే ఈ అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జాతీయ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫారుక్‌ అబ్దుల్లా, శిరోమణి అకాళీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ డిప్యుటీ సీఎం, ఎంపీ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా వంటి సీనియర్‌ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ముందు ముందు మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపే ఛాన్స్ కనిపిస్తున్నది. అలాగే పలువురు జాతీయ నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరం వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన, ప్రకంపనలు సృష్టిస్తున్న చంద్రబాబు అరెస్టుపై సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ నుండి కూడా   వివిధ పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. సీనియర్ నేతలు వీహెచ్ లాంటి వారైతే చంద్రబాబు లాంటి నాయకుడిని అరెస్టు చేయడం ఏపీలో పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అయితే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబు అరెస్టుపై తీవ్ర విమర్శలు చేశారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిని కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. మరో తెలంగాణ బీజేపీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కూడా చంద్రబాబు అరెస్టును తప్పు బట్టారు. అర్ధరాత్రి వేళ అరెస్టులకు తెగబడడం ఏమిటని ప్రశ్నిచారు. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుపై నేతలు మండిపడుతున్నారు.

అయితే  జాతీయ స్థాయిలో నేతల నుండి చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందన వస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకూ పన్నెత్తి మాట్లాడలేదు.  స్పందించలేదు. వారి మౌనమే ఇప్పుడు రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కూడా జాతీయ స్థాయి నేతలే. దేశ రాజకీయాలపై కూడా స్పందించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అందునా ఏపీలో కూడా బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నది. ఏపీలో బీఆర్ఎస్ క్రీయాశీలంగా ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. ఆ రాష్ట్రంలో ఏపీ బీఆర్ఎస్ శాఖఉంది. రాష్ట్ర కార్యాలయం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు.  ఇలాంటి తరుణంలో ఏపీలో ఇంతటి బర్నింగ్ ఇష్యు నడుస్తున్న వేళ, అందునా తెలంగాణ పాలిట కల్పతరువుగా మారిన హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సర్కిల్ లో  ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున బాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఐయామ్ విత్ బాబు అన్న ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. వారంతా స్వచ్ఛందంగా ఆందోళన బాట పట్టారు. ఇప్పటి దాకా ఉద్యోగులు తమ వేతనాల గురించో, ఇతర సమస్యల గురించే ఆందోళనలకు దిగడం చూశాం. కానీ ఐటీ ఉద్యోగులు తమ జీవితాలలో ఐటీ వెలుగులు నింపిన వ్యక్తి పట్ల కృతజ్ణతతో, ఆయన అక్రమ అరెస్టు పట్ల ఆవేదనతో బయటకు రావడం బహుశా ఇదే మొదటి సారి.

ఇక కూకట్‌పల్లిలో చంద్రబాబు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను కేసీఆర్‌, కేటీఆర్‌ ఖండించకపోవడం పట్ల వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక అరెస్ట్పై హైదరాబాద్ సెటిలర్స్ భగ్గుమంటున్నారు. చంద్రబాబు అరెస్ట్పై  తెలంగాణ పౌరహక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ అభిమానులు నిరసనల్లో పాల్గొని అటు ఏపీ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా మండిపడుతున్నారు. అయినా కేసీఆర్, కేటీఆర్ నుండి ఎలాంటి స్పందన లేదు. జగన్ మోహన్ రెడ్డితో మైత్రి కారణంగానే కేసీఆర్ అండ్ కో ఈ అంశంపై స్పందించడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ చంద్రబాబును ఉమ్మడి శత్రువుగానే చూస్తున్నారని.. అందుకే ఈ అక్రమ అరెస్టును ఖండించడం లేదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.