ఉచితాలపై మోడీ వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ ఫైర్..జగన్ మౌనానికి కారణమదేనా?

Publish Date:Jul 17, 2022

Advertisement

ప్రధాని  నరేంద్ర మోడీ ఎందుకు చేశారో, ఎవరిని టార్గెట్ చేసి  పేల్చారో తెలియదు కానీ ఓట్ల  కోసం ఉచిత  పంపిణీల(పథకాలు) పై ఆయన చేసిన వ్యాఖ్యలు  దేశ  వ్యాప్తంగా సంచలనం  సృష్టించాయి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ లో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున  చర్చ  జరుగుతోంది. కచ్చితంగా ఏపీ  ప్రభుత్వ తీరును  ఎండగడుతూనే  మోడీ పరోక్షంగా  ఫ్రీ బీస్  పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని  విపక్షాలు గట్టిగా నొక్కి  చెబుతున్నాయి.

అయితే మోడీ వ్యాఖ్యల టార్గెట్ జగన్ అని విపక్షాలు అంటున్నా.. ఏపీ  సీఎం  జగన్ మాత్రం  ఇప్పటి  వరకూ మోడీ వ్యాఖ్యలపై  స్పందించలేదు. దేశలో ఏ రాష్ట్ర్రం చేయని విధంగా ఏపీలో సంక్షేమానికి  పెద్ద పీట వేశామనీ, దేశం  మొత్తం  తన ప్రభుత్వ విధానాలను అనుసరించడమే  మిగిలి ఉందనీ తన  భుజాలను తానే  చరిచేసుకుంటూ  సంక్షేమ  లబ్ధిదారులకు సొమ్ముల పంపిణీ  సభలలో ప్రసంగాలు చేసే  జగన్  ఇప్పుడు మోడీ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని విపక్షాలు  విమర్శలు గుప్పిస్తున్నాయి.

అయితే మోడీ లక్ష్యం ఒకటి అయితే ఆయన విమర్శ బాణం మరొక  చోట తగిలిందా  అన్న  అనుమానాన్ని  పరిశీలకులు వ్యక్తం  చేస్తున్నారు. మోడీ  వ్యాఖ్యలపై ఏపీ  సీఎం  జగన్  మౌనంగా ఉంటే...  ఢిల్లీ  సీఎం  కేజ్రీ  వాల్  మాత్రం  ఘాటుగా స్పందించారు. నేరుగా  ప్రధాని  పేరు ప్రస్తావించకుండానే.. ఉచిత విద్య, ఉచిత విద్యుత్ పథకాలు కేవలం ఉచిత పథకాలు  కావని కేజ్రీవాల్ అన్నారు. అవి భవిష్యత్  తరాల  బాగు కోసం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి లాంటివన్నారు. ఉచిత విద్య వల్ల  పేదలు చదువుకుని దేశ ప్రగతిలో, ఉత్పాదకతలో భాగస్వాములౌతారని  అన్నారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయనీ వివరించారు.

నిజమైన ఉచితాలనేవేమైనా ఉంటి  అవి బడా వ్యాపారులకు చేసే వేల కోట్ల రూపాయల మాఫీలేనని రిటార్డ్  ఇచ్చారు. అంతే  కానీ ఢిల్లీ  ప్రభుత్వం  18 లక్షల మందికి ఉచిత విద్య, రెండు కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం ఉచిత పథకాల కిందకు రావని అన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య ద్వారా దేశ ప్రగతిని మా వంతు సహకారం అందిస్తున్నట్లేఅన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో మొహల్లా క్లినిక్  లు అద్భుత  పాత్ర్  వహిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయ  పార్టీలకు  విరాళాలిచ్చి, బ్యాంకుల  నుంచి  వేల కోట్ల  రూపాయలు అప్పులు తీసుకున్న బడా  వ్యాపార సంస్థలు, పారిశ్రామిక  వేత్తలకు చేసే  రుణ మాఫీ  నిజమైన ఉచిత పథకమని కేజ్రీవాల్ అన్నారు. శ్రీలంక పర్యటనలో అదానీకి కోట్లాది  రూపాయల కాంట్రాక్టు  కోసం మీరు చేసిన దౌత్యం నిజమైన  ఉచిత  పథకమని మోడీని ఉద్దేశించి  కేజ్రీవాల్ విమర్శించారు.
 అయితే ఉచితాలపై మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలపై నిజంగా భుజాలు తడుముకుని స్పందించాల్సిన జగన్ మౌనంగా ఉండటానికి  కారణమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  నోరెత్తి  మాట్లాడితే.. కేసుల దొంతర కదులుతుందన్న భయమా.. భవిష్యత్ లో అప్పుపట్టదన్న బెరుకా  అని  ప్రశ్నిస్తున్నారు.  

By
en-us Political News

  
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.