Publish Date:Apr 26, 2025
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డిని పోలీసులు శుక్రవారం (ఏప్రిల్ 25) అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై వ్యవహరించి సకల శాఖల మంత్రిగా, సీఎం జగన్ కు కళ్లు, చెవులూ నోరుగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డిఫాక్టో సీఎంగా చక్రం తిప్పిన రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా సామాజిక మాధ్యమంలో అడ్డగోలు పోస్టులు, అనిచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోయి భ్రష్టుపట్టిన పిల్ల సజ్జల అదేనండి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం సజ్జల భార్గవ రెడ్డే అందరికీ సుపరిచితులు. కానీ ఇప్పుడు జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అని చెప్పబడుతున్న రాజ్ కసిరెడ్డి తరువాత అరెస్టైన వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి. మద్యం కకుంభకోణంలో ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి వసూల్ రాజాగా వ్యవహరించారనీ, మద్యం తయారీ కంపెనీలు కమీషన్లు చెల్లించేలా కంపెనీలను వాటిని బెదిరించడం, వసూలు చేసిన కమిషన్లను చేర్చాల్సిన చోటికి చేర్చడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించినది సజ్జల శ్రీధర్ రెడ్డిది దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. సరే ఇప్పుడు అసలు ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే.. మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకే వెళ్లాల్సి ఉంటుంది.
జగన్ ప్రభుత్వంలో కీలక ప్రాత పోషించిన, సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి.. తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి (పిల్ల సజ్జల) సహా తన మిత్రులు,బందువులు, సన్నిహితులే కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పేలా చర్యలు తీసుకున్నారు. అలాంటి వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి సమీపబందువు సజ్జల శ్రీధర్ రెడ్డి ఒకరు. ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి నంద్యాల మాజీ ఎంపి ఎస్పీవై రెడ్డికి అల్లుడు కూడా. ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ర్. అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే.. శ్రీధర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామం.2012 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో నంద్యాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాతే వైసీపీలో చేరారు. చేరి మద్యం స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/who-is-sajjala-sridhar-reddy-39-196990.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.