ఏ పోషకాలు లోపించడం వల్ల జుట్టు బాగా రాలిపోతుందో తెలుసా?

Publish Date:Jan 28, 2025

Advertisement

 

జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య. అయితే అమ్మాయిలే దీనికి ఎక్కువ బాధితులుగా ఉంటారు. అలాగే జుట్టు రాలుతోందని ఆందోళన చెందేవారిలో కూడా అగ్రభాగం అమ్మాయిలే ఉంటారు. అయితే వాతావరణం,  కేశ  సంరక్షణ కోసం ఉపయోగించే ఉత్పత్తులు.. జీవనశైలి మొదలైనవి మాత్రమే కాకుండా  తీసుకునే ఆహారం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది.  ఆహారంలో కొన్ని పోషకాలు లోపిస్తే  జుట్టు బాగా రాలిపోతుందట.  ఇంతకీ ఆ పోషకాలు ఏంటో తెలుసుకుంటే..

ఐరన్..

ఐరన్ అనేది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.  మహిళలు ఐరన్ బాగా తీసుకోవాలని చెబుతారు.  ఐరన్ లోపం ఉన్న మహిళలలో జుట్టు చాలా పలుచగా ఉంటుంది. అలాగే జుట్టు రాలిపోవడం,  జుట్టు రాగి రంగులో ఉండటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఐరన్ లోపం ఉంటే జుట్టు మూలాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. అందుకే జుట్టు సమస్యలు వస్తాయి.

జింక్..

జింక్ కూడా శరీరానికి చాలా అవసరమైన ఖనిజం.   ఇది శరీరంలో కణజాలాన్ని రిపేర్ చేయడానికి కణజాలం పెరుగుదలకు, కణజాలం ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. జింక్ లోపిస్తే జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ ఉంటుంది.

బయెటిన్..

బయోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైన పోషకం.  బయోటిన్ ఆధారిత షాంపూలు, సీరమ్ లు,  కండీషనర్లు మార్కెట్లో చాలా అందుబాటులో ఉంటాయి.  బయోటిన్ లోపిస్తే జుట్టు పెళుసుగా మారుతుంది.  తొందరగా విరిగిపోతుంది.  జుట్టు బాగా రాలిపోతుంది.

ప్రోటీన్లు..

జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు కూడా చాలా ముఖ్యం.  జుట్టు కెరాటిన్ తో తయారు అవుతుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇవి లోపిస్తే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.  తిరిగి జుట్టు పెరుగుదలలో ఎలాంటి మెరుగుదల కనిపించదు.

విటమిన్-ఇ..

విటమిన్-ఇ అనేది గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల జుట్టు రాలుతుంది.  ఇప్పట్లో చాలా కేశ సంరక్షణ ఉత్పత్తులలో  విటమిన్-ఇ చేర్చబడి ఉంటుంది. అప్పటికి ఈ విటమిన్-ఇ అనేది జుట్టుకు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.

విటమిన్-డి..

విటమిన్-ఇ లాగానే విటమిన్-డికూడా జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యం.  ఇది వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విటమిన్-డి లోపిస్తే కుదుళ్లు బలహీనపడతాయి.  జుట్టు రాలడానికి కారణం అవుతుంది.


గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...


                                      *రూపశ్రీ.

By
en-us Political News

  
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
Black Spots on Onions,Are They Safe to Eat,Black Mold on Onions,What Black Spots on Onions Really Mean
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.