తిరుపతి లడ్డు వివాదం ..ధర్మారెడ్డి ఏరీ? ఎక్కడ?

Publish Date:Sep 23, 2024

Advertisement

తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం.. ప్రజల మనోభావాలను తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ ప్యాప్తంగా జనం ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద కూడా బీజేపీ ధర్నా చేసింది. జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. ఇక జాతీయ మీడియా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిబేట్లు నిర్వహించింది. అంటే జగన్ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ప్రజలు సందేహాలకు అతీతంగా నిర్ధారణకు వచ్చేశారు.  ఒక్క చాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థించి అధికారంలోకి వచ్చిన జగన్  ఐదేళ్ల పాటు బాధ్యతారహితంగా అరాచక పాలన సాగించారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష సాధింపులే తన పాలనా విధానం అన్న రీతిలో జగన్ పాలన సాగింది. అదంతా పక్కన పెడితే..

 తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాల్సిన అప్పటి  తిరమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేదు.  జగన్ హయాంో ఐదేళ్లపాటు  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాలి. కానీ ఆయన ఆచూకీ తెలియడం లేదు.  

జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐదేళ్లు వెలగబెట్టిన ధర్మారెడ్డి.. 2024 ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు పదవీ విరమణ చేశారు.  జగన్ హయాంకు ముందు వరకూ టీటీడీ ఈవోలుగా పని చేసిన వారంతా ఐఏఎస్ అధికారులు మాత్రమే. కానీ  జగన్ అధికారం చేపట్టిన తరువాత టీటీడీ ఈవో నియోమకం విషయంలో సంప్రదాయానికీ, ఆనవాయితీకి పంగనామాలు పెట్టేసి ఐడీఈఎస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్)కి చెందిన ధర్మారెడ్డిని ఏరి కోరి మరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు.  జగన్ అప్పగించిన బాధ్యతను ధర్మారెడ్డి తు.చ.తప్పకుండా నిర్వర్తించారు. తిరుమల పవిత్రతను మంటగలిపే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగినా పట్టించుకోలేదు. రాజకీయ ప్రసంగాలకు వేదికగా తిరుమల మారుతున్నా మాట్లాడలేదు. టీటీడీలో అన్యమతస్తులను కొలువులు కట్టబెట్టారు. ఇలా టీటీడీ జగన్ హయాంలో ధర్మారెడ్డి జాగీర్ అన్నట్లుగా మారిపోయింది. ధర్మారెడ్డి జాగీరు అంటే జగన్ జాగీరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సరే ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. జగన్ హయాంలో టీటీడీలో రాజ్యమేలిన అరాచకం, అకృత్యాలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని వెలుగులోనికి వచ్చింది. వీటన్నిటికీ తొట్ట తొలుత బాధ్యత వహించాల్సింది అప్పటి ఈవో ధర్మారెడ్డి మాత్రమే. ఆ తరువాత అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయనకు మందు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే వీరిలో ధర్మారెడ్డి మాత్రం కనిపించడం లేదు. వినిపించడం లేదు.  

ఐదేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఆంధ్ర సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డి, తనకు జూన్ 30 వరకూ ఎక్స్ టెన్షన్ ఇవ్వాల్సిందిగా ఎన్నికలకు ముందు కోరారు. అందుకు కేంద్రం అంగీకారం కూడా తెలిపింది. అయితే ఎన్నికలలో జగన్ రెడ్డి పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ధర్మారెడ్డిని సెలవుపై పంపింది.  జూన్ 30తో ఎక్సటెన్షన్ ముగియటంతో సొంత క్యాడర్ లో చేరి ఉండాలి కానీ చేరారా లేదా అన్న సమాచారం లేదు.   

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.