సంకోచాలు, సవాళ్లు, వ్యక్తిగత వివాదాలు ఇవేవీ విజయ్ ను నిలువరించలేకపోయాయి. తమిళనాట దళపతి రాజకీయ ప్రభంజనం సృష్టించారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని అందుకోవడంతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినీ గ్లామర్‌తో పెనవేసుకుపోయి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల తర్వాత ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరనే ప్రశ్నకు విజయ్ సమాధానంగా నిలిచారు. తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు. భార్యతో విడాకుల ప్రచారాలు, నటి త్రిషాతో ముడిపెట్టి చేసిన విమర్శలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భాష్యాలు చెప్పారు. కానీ.. తమిళ ఓటర్లు వ్యక్తిగత విషయాల కంటే విజయ్ ఆశయాలకే పెద్దపీట వేశారు.
ప్రచార పర్వంలో జరిగిన ఒక బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సరైన అనుమతులు లేకపోవడంతో విజయ్ మలేషియాకు వెళ్లి అక్కడి నుండే డిజిటల్ ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని కొనసాగించారు. జాతీయ స్థాయి విశ్లేషకులు టీవీకే పార్టీకి స్వల్ప స్థానాలే దక్కుతాయని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తేల్చాయి. కానీ.. ఫలితాలు మాత్రం యావత్తు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఏకంగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్ కు అతి చేరువకు చేరుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీల ఆధిపత్యానికి ఆయన బ్రేక్ వేశారు.
విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఆయన సినిమా ఇమేజ్ వల్ల వచ్చింది కాదు. ప్రజల్లో ఆయనపై ఉన్నఅపార విశ్వాసానికి నిదర్శనం. ఎంజీఆర్, జయలలిత వంటి చారిత్రాత్మక నాయకుల వారసత్వాన్ని విజయ్ నిలబెడతారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అవినీతి రహిత, ప్రజాహిత పాలనను ఆయన అందిస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు. ఇక దళపతి ‘విజయ్ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/when-is-vijay-sworn-in-cermony-39-218942.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.