కేసీఆర్ ఛీ అన్నా మోడీనే నంబర్ వన్

Publish Date:Aug 27, 2022

Advertisement

“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో, దేశానికి పనికొచ్చే ఒక్క మంచి పనిచేసింది, లేదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిందీ లేదు. మోడీ వట్టి పనికిమాలిన  ప్రధాని. ఇంత పనికి మాలిన ప్రదానిని నేను నా 40 సంవత్సరాల  రాజకీయ జీవితంలో చూడలేదు.” ఈ మాటలు ఎవరివో వేరే చెప్పనక్కరలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచు చేస్తున్న విమర్శ ఇది. నిజమే, ఒక్క కేసీఆర్ అనే కాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ, మోడీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు.  

కానీ, దేశంలో విపక్షాలు మోడీని ఎంతగా విమర్శించినా, అంతర్జాతీయంగా ఆయన ప్రతిష్ట మరింతగా పెరుగుతూనే వుంది, కానీ, గ్రాఫ్ పడిపోయిన దాఖలాలు మాత్రం లేవు. నిజానికి, అంతర్జాతీయంగానే కాదు, జాతీయంగానూ, రాహుల్ గాంధీ సహా ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరికంటే, మోడీనీ ఫస్ట్ ప్లేస్’లో ఉన్నారు. ఓ పక్షం రోజుల క్రితం ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ డి నేషన్ సర్వే’లోనూ 53 శాతం మంది ప్రజలు మాలీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.

మోడీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని అనుకుంటోంది కేవలం 9 శాతం మంది మాత్రమే. అలాగే, జస్ట్ ఓ 7 శాతం మంది కేజ్రీవాల్’ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. సో, రాహుల్ గాంధీ, కేసీఆర్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీని  పనికిమాలిన ప్రధాని అని ఎద్దేవా చేసినా దేశ ప్రజలు మాత్రం  మోడీకే జై కొడుతున్నారని, అనుకోవచ్చును. సర్వేలే కాదు. ఎన్నికల ఫలితాలు కూడా అదే సుస్చిస్తున్నాయి, అనుకోండి, అదివేరే విషయం.   

అదలా ఉంటే, దేశీయంగానే కాదు, అంత‌ర్జాతీయంగా కూడా  ప్రధాని మోడీ ఛ‌రిష్మా ఒకేలా వుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న మోడీకి జాతీయ స్థాయిలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంత‌ర్జాతీయంగా కూడా అంటే  ఫాలోయింగ్ ఉందని మరో మారు రుజువైంది. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ "మార్నింగ్ కన్సల్ట్‌ "ప్ర‌పంచ అత్యుత్త‌మ నేత‌” ఎవరనే విషయంగా నిర్వహించిన స‌ర్వేలో మోడీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు.

ఓటింగ్’లో పాల్గొన్న వారిలో 75 శాతం మంది, ‘మోడీ ది బెస్ట్’  అని కితాబు నిచ్చారు.  ప్రపంచ నేతల్లో నరేంద్ర మోడీయే మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేత‌ల‌పై మార్నింగ్ కన్సల్ట్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ 22 మంది దేశాధినేతల్లో అత్యధికంగా 75 శాతం రేటింగ్ సంపాదించుకుని మోడీ ప్రధమ స్థానంలో  నిలిచారు. 63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. అయితే ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో బైడెన్ తర్వాత స్థానంలో ఉన్నారు.

మార్నింగ్ కన్సల్ట్‌... పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోడీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి.

అయితే గత ఏడాది కొవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ఒక సర్వేలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు.ఇప్పడు మళ్ళీ అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.