గోళ్ళ మీద కనిపించే ఇలాంటి లక్షణాలు ఎంత డేంజరో తెలుసా?

Publish Date:Oct 11, 2024

Advertisement

చాలామంది వేలి గోళ్ళు, కళ్ళు, పెదవులు, దంతాలు మొదలైనవి చూసి ఆయా వ్యక్తుల శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయనేది చెప్పేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు  డాక్టర్లు కూడా మొదట నాలుక, కళ్లు, చేతివేలి గోళ్లు చూస్తుంటారు.ఆ తరువాతే స్టెతస్కోప్ తో గుండె  వేగాన్ని చెక్ చేస్తుంటారు. అయితే చేతివేలి గోళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు చాలా ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుంది. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్.  ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది.  క్యాన్సర్ లలో పలురకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి చాలా  ప్రమాదకరమైనది అయినప్పటికీ అత్యంత  సాధారణ కేసులు రొమ్ము, పెద్దప్రేగు, పురీషనాళం, ప్రోస్టేట్,  ఊపిరితిత్తుల మొదలైన క్యాన్సర్ లుగా నమోదు అవుతున్నాయి. వీటన్ని వెనుక   ఉన్న అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, దీనికారణంగా ఎంతో మంది వివిధ రకాల జబ్బులతో పోరాడుతున్నాడు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ గణాంకాలు ఎలా ఉన్నాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా 18లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. వీరిలో అధికశాతం మంది పేలవమైన జీవనశైలి కలిగి ఉన్నవారే కావడం గమనార్హం.

ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు..

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులలో వివిధ లక్షణాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ దగ్గుతూ ఉంటారు. దీనికి తోడు ఊపిరి తీసుకోవడంలో సమస్య, ఛాతీ నొప్పి, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతులో మార్పు, ఊహించని విధంగా బరువు తగ్గడం, ఎప్పుడూ అలసటగా ఉంటడం,  భుజంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి.

గోర్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చంటే..

ఊపిరితిత్తుల క్యాన్సర్ ను పైన చెప్పుకున్న అన్ని లక్షణాల ఆధారంగానే కాదు, గోళ్ల కండీషన్ ను బట్టి కూడా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి  చేసిన  కొన్ని పరిశోధనల ప్రకారం   నెయిల్ క్లబ్ లు ఉన్నవారిలో 80శాతం మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని సూచిస్తుందని వారు తెలిపారు.

అసలు నెయిల్ క్లబ్బింగ్ అంటే..

నెయిల్ కర్లింగ్ ను నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. కర్లింగ్ అంటే వంపులు తిరిగి ఉండటం. గోర్లు వంకరగా, వెడల్పుగా వాపు కలిది ఉండటం, పై నుండి కిందకు వంగి ఉండటాన్ని నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. ఈ నెయిల్ క్లబ్బింగ్ లో మొదట  గోర్లు పట్టుత్వం కోల్పోతాయి. ఆ తరువాత గోరు వేలు లోపలినుండి కూడా కదలడం, అది కేవలం వేలి మాంస కండ మీద అలా అతుక్కున్న విధంగా అనుభూతిని ఇస్తుంది. జస్ట్ అలా లాగితే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది.

కేవలం ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు..

ఇలా గోర్లు వేలి మూలాల నుండి కదిలినట్టు, పట్టు లేనట్టు ఉంటే అది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యే అవకాశం 80శాతం ఉంది. మిగిలిన  ఛాన్సెస్ లో కుటుంబ చరిత్ర ఆధారంగా ఉదరకుహుర వ్యాధి, లివర్ సిర్రోసిస్, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు అవకాశం ఉంది. కాబట్టి గోర్లు ఎప్పుడైనా దారుణమైన కండీషన్ కు లోనైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవడం ప్రమాదాన్ని  ముందే గుర్తించి జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.

                                                      *నిశ్శబ్ద.

By
en-us Political News

  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.