అమిత్ షా, నడ్డాలతో పవన్ భేటీ.. దేనికి సంకేతం?

Publish Date:Apr 3, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెనుమార్పులు జరగనున్నాయా? పొత్తుల విషయంలో ఒక స్పష్టత రానుందా? బీజేపీ అటా ఇటా అన్న డైలమా నుంచి బయటపడుతోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నాయి. అందుకు తార్కానంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలుగుదేశం నేతలతో భేటీని చూపుతున్నారు. అంతే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా,   బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం (ఏప్రిల్ 3)భేటీ కానుండటం కూడా ఏపీలో పొత్తల విషయంలో బీజేపీలో కదలిక వచ్చిందనడానికి తార్కాణంగా చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఆదివారం రాత్రి (ఏప్రిల్ 3) ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన అమిత్ షా, నడ్డాలతో భేటీ అవుతారన్న కన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ, ఏ సమయంలో వారితో బేటీ ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు. ఒకే సారి వారిరువురితో భేటీ అవుతారా? విడివిడిగా భేటీ అవుతారా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు.  హస్తిన పర్యటనలో పవన్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.  ఇలా ఉండగా బీజేపీ పెద్దల పిలుపు మేరకే పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లినట్లుగా చెబుతున్నారు. కుటుంబంతో వెకేషన్ కు రాజస్థాన్ వెళ్ళిన పవన్ కల్యాణ్ అక్కడి నుంచే నేరుగా హస్తిన చేరుకున్నారు.  

ఏపీలో తెలుగుదేశంతో జనసేన ఇప్పటికే పొత్తకు నిర్ణయించుకుందన్న వార్తలు బలంగా వినవస్తున్నాయి. అందుకు తగినట్టుగానే పవన్ కల్యాణ్ కూడా పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తనకు పెద్దగా సఖ్యత లేకపోయినా ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వాన్ని ఏపీలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఒప్పిస్తానని కూడా పవన్ గతంలో ఒకసారి చెప్పారు. ఇప్పుడు స్వయంగా బీజేపీ అధిష్ఠానం ఆయనను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ఏపీలో బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడబోతున్నాయా అన్న చర్చకు తెరలేపింది. అలాగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆ రాష్ట్రంలో తెలుగు వారి ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాలలో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేయాల్సిందిగా కోరేందుకే బీజేపీ అగ్రనాయకత్వం పవన్ కల్యాణ్ తో భేటీ అవుతోందన్న చర్చ కూడా వినవస్తోంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో అమిత్ షా, నడ్డాలతో భేటీ కానుండటం కచ్చితంగా ఏపీ రాజకీయాలలో కీలక మలుపునకు, పరిణామానికి సంకేతమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధమవుతోందని ఇప్పటికే అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలను పవన్ కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో జనసేన, బీజేపీల మధ్య ప్రస్తుతం పొత్తు ఉన్నప్పటికీ, రెండు పార్టీలు కలిసి పనిచేయడం మాత్రం జరగడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి జనసేన అభిమానులు ఓటు వేయలేదని బీజేపీ నేత మాధవ్ బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే భేటీలతో ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే ఆసక్తి నెలకొంది.

By
en-us Political News

  
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.