పిఠాపురంలో ఏం జరుగుతోంది?.. టీడీపీ శ్రేణులపై కేసుల సంకేతం ఏమిటి?

Publish Date:Apr 7, 2025

Advertisement

పిఠాపురంలో అసలేం జరుగుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకర్గం పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఏడాది జరిగిన ఎన్నికలలో  పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ నియోజకవర్గం నుంచే జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు.  అయితే అప్పటి వరకూ ఆ నియోజకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని అంతా భావించిన ఎస్పీఎస్ఎన్ వర్మ  చంద్రబాబు చెప్పిన ఒక్క మాటకు తలొగ్గి హుందాగా తప్పుకున్నారు. అంతే కాకుండా పిఠాపురం నుంచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. జనసేనాని విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అప్పట్లో చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు. అయితే తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ పిఠాపురంలో మాత్రం ఇరు పార్టీల క్యాడర్ మధ్యా గ్యాప్ పెరుగుతూ వచ్చింది.  నియోజకవర్గంలో వర్మకు ఉన్నపట్టు పలకుబడి జనసేన శ్రేణులలో భయాన్ని పెంచుతున్నది. వర్మ పట్టు పలుకుబడి వారిని భయపెడుతున్నది.  నియోజకవర్గంలో ఆయన అధికార కేంద్రంగా మారుతారన్న భయంతో జనసేన ఆయనను పక్కన పెట్టడం ప్రారంభించింది. 

ఇక ఇప్పుడు తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్య టించారు. ఆ సందర్భంగా జనసేన, తెలుగుదేశం శ్రేణుల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా బయట పడ్డాయి. జనసేన తీరు ఏరు దాటాకా అన్న సమెతను తలపింప చేస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. ఎందుకంటే నాగబాబు పర్యటన సంద ర్భంగా వర్మకు ఆహ్వానం అందలేదు. నాగబాబు ఈ పర్యటనలో కొన్ని ప్రారంభోత్వాలలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున జరిగిన ఈ అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందలేదు. దీనికి నిరసనగానా అన్నట్లుగా నాగబుబు పర్యటన ఆసాంతం తెలుగుదేశం కార్యకర్తలు వర్మ అనుకూల నినాదాలు చేశారు. ప్రతిగా జనసేన కార్యకర్తలు జనసేన, పవన్ కల్యాణ్, నాగబాబు అనుకూల నినాదాలు చేశారు. ఇరువర్గాల పోటా పోటీ నినాదాలతో నాగబాబు పర్యటించిన రెండు రోజులూ పిఠాపురం దద్దరిల్లిపోయింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. నాగబాబు పర్యటన ముగిసిన తరువాత.. తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదౌతున్నాయి. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఒక ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఇంకో కేసు నమోదైంది. 
స్థానిక జనసేన నాయకుడుమొయిళ్ల నాగబాబు ఫిర్యాదుపై  తెలుగుదేశం కార్యకర్తలపై కేసు నమోదైంది.  తెలుగుదేశం కార్యకర్తలు తనను అడ్డుకుని తన మోటార్ సైకిల్ ను ధ్వంసం చేశారని మెయిల్ల నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదింది. ఇక ఇంకో కేసు  ఏఎస్ఐ జానీ బాష ఫిర్యాదు మేరకు నమోదైంది. తెలుగుదేశం కార్యకర్తలు తన విధులకు ఆటంకం క లిగించారని ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు కేసులు నమోదు చేశారు.  
ఇక్కడ రెండు విషయాలను చెప్పుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పోలీసులే వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే పరిస్థితి జగన్ హయాంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎదుర్కొన్నారు.  దీనిని బట్టి చూస్తుంటే స్థానిక పోలీసులు జనసేన ఆదేశాలను అమలు చేస్తున్నారని భావించాల్సి వస్తోంది.  ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే పిఠాపురంపై దృష్టి పెట్టాలి. లేదంటే పిఠాపురం తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుకుని పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.  అాదే జరిగితే పిఠాపురంలో నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే కాదు జనసేనే కాదు. రెండు పార్టీలతో పాటు కూటమి ఐక్యతకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.  పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఇరు పార్టీలపైనా సమానంగా ఉంటుంది. ఒంటి చేతి చప్పట్ల వళ్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు.
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. సుంకాలపై ముందునుంచీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు.
ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి.
పవన్ మాజీ సతీమణి రేణూదేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నారా? తాను మోడీ భక్తురాలినని చెప్పిన రేణూదేశాయ్ తన జాతకంలోనే రాజకీయ నాయకురాలినని ఉందని చెప్పడం వెనుక ఉద్దేశం బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించడమేనా?
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ‌లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.
వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మపై రాజమహేంద్రవరంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ప్రెషర్ బాంబు పేలిన వెంటన కూంబింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే  ప్రెషర్ బాంబు దాడికి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి.
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు 128 ఏళ్ల తరువాత క్రికెట్ కు మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించనుంది. ఒలింపిక్స్ లో చివరి సారిగా 1900లో క్రికెట్ ఆడారు.
2008 ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను అమెరికా అప్పగించింది. ప్రత్యేక విమానంలో రాణా ఇండియాకు బయలు దేరారు. మరికొద్ది సేపట్లో రాణా భారత్ కు చేరుకునే అవకాశం ఉంది.
తెలుగుదేశం నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ నెడ్డిపై పొలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.