గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? ఎందుకు వస్తుంది??

Publish Date:Feb 28, 2023

Advertisement

ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకొస్తుంది?? అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? తెలుసుకుంటే.. 


మనం ఆహారంతో పాటు గాలిని మింగుతుంటాం. ఈ అలవాటున్నా కార్బొనేటెడ్ పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటున్నా, చూయింగ్ గమ్ తినే అలవాటున్నా, ధూమపానం చేస్తున్నా త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి.  ఇలాంటి వారిలో కడుపులోపల బాగా ఉబ్బరించినట్లుంటుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆ వాయువు కారణం చేతనే గుండె మండుతున్నట్లుంటుంది. జఠరాశయంలోని ఈ గాలి చిన్న ప్రేగులలోకి వెళ్తుంది. ఇక్కడ ఇది చిన్నప్రేగుల గోడలద్వారా పీల్చిబడుతుంది. లేకపోతే గ్యాస్ రూపంలో  బయటికి నెట్టివేయబడుతుంది.


కడుపుబ్బరించే గాస్ తో బాధపడుతున్నా మనిపించినప్పుడు ఏ పదార్థాలు గ్యాస్ ని ఉత్పత్తి చేయడానికి కారణం అవుతున్నాయో వాటిని తినడం మానేయాలి. అలాగే గ్యాస్ ఉత్పత్తికి కారణమైన అలవాట్లని మానుకోవాలి. చాలా మంది త్రేన్పులు వస్తుంటే లోపలి గాలి బయటకు వెళ్ళి పోతోందని అనుకుంటారు. కాని వాస్తవానికి ఈ త్రేన్పుల వల్ల లోపలి పరిస్థితి మరింతగా దెబ్బతింటుంది. ఒక్కోసారి జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేప్పుడు కూడా రకరకాల రసాయనిక మార్పులు కారణంగా కూడా గ్యాస్ ఉత్పత్తి కావచ్చు. జఠరాశయం, పెద్ద, చిన్న ప్రేగులు గాలితో నిండి ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. త్రేన్పుల ద్వారా వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వుంటాయి. అదే గ్యాస్ రూపంలో వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ లతోపాటు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిధేన్ కూడా వుంటాయి. పిండి పదార్థాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు ఆ పదార్థాలు చిన్నపేగులలో పేరుకు పోయినప్పుడు బాక్టీరియా అనే సూక్ష్మజీవులు అక్కడ చేరతాయి. ఈ బాక్టీరియా వున్నప్పుడు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిథెన్ గ్యాస్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ కుళ్ళిన పదార్థాల దగ్గరే చెడ్డ వాసన పుడుతుందన్నమాట!


ఇలా గ్యాస్ సమస్యతో ఇబ్బందికి గురువుతున్నప్పుడు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిని ఒక్కసారిగా తాగేయకూడదు.  కొద్దికొద్దిగా చప్పరిస్తూ త్రాగాలి. ఆహారాన్ని పెదాలు మూసుకుని బాగా నమిలి తినాలి. మనస్సు ఆందోళనగా వున్నప్పుడు కాక ప్రశాంతంగా వున్నప్పుడు తినాలి. కొద్ది కొద్దిగా తినాలి. ఎక్కువెక్కువ తినకూడదు.


గుండె ప్రాంతంలో మంట ఈ గ్యాస్ ఉత్పత్తి కారణానో, యాసిడ్ ఉత్పత్తి కారణానో వస్తుంటుంది. ఈ మంట లోపలి మార్పులను సూచించే ఒకానొక సిస్టమే కానీ జబ్బుకాదు. ఈ మంట లోపల ఆహారం పులియడం వల్లగాని, నోటిలో కొంత జీర్ణమైన ఆహార పదార్థాలు ఉండడంవల్ల కూడా కలగవచ్చు. ఆహారం జీర్ణమవడానికి జఠరాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ ఎంజైమ్స్ కలుస్తాయి. ఈ కారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వొస్తుంది.


                                      ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.