జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు గుర్తింపు అంతంత మాత్రమేనా?

Publish Date:Jan 30, 2023

Advertisement

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీని విజయం వరిస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ కూటమిలో ఏయే పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పుంజుకుందా? బీజేపీకి పోటీ ఉందా? అంటే వరుస సర్వేలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి  సర్వేలలో  రాహుల్ జోడో  యాత్రలో కాంగ్రెస్ బాగా పుంజుకున్నప్పటికీ మొగ్గు బీజేపీ వైపే ఉందంటూ సర్వేలు చెబుతున్నాయి. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రభావం చూపే పార్టీలు, సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నాయి.

అయితే ఎక్కడా వచ్చేది రైతు రాజ్యమే.. మోడీ ఇంటికి.. మేం హస్తిన కు అంటూ గంభీరంగా ప్రసంగాలు దంచుతున్న కేసీఆర్ బీఆర్ఎస్ ను మాత్రం జాతీయ సర్వేలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ప్రధాని మోడీని, కేంద్రంలోని ఆయన సర్కార్ ను విమర్శించడంలో చాంపియన్ గా తనను తాను ప్రకటించుకుంటున్న కేసీఆర్ ను కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీని కానీ సర్వేలు పరిగణనలోనికి తీసుకోకపోవడానికి ఆ పార్టీ ఇంకా రాష్ట్రాలలో విస్తరించకపోవడమే కారణమని సరిపెట్టుకుం దామనుకున్నా.. కనీసం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభావం గురించి కూడా సర్వేలు ప్రస్తావించకపోవడం.. ప్రాంతీయంగా  కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

ఈ ఏడాది జరిగే  తెలంగాణ అసెబ్లీ ఎన్నికలలో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందన్న అంచనాలున్నాయి. అయితే జాతీయ స్థాయి సర్వేలు పూర్తిగా వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభావం చూపే అవకాశాలు లేవా అన్న చర్చ మొదలైంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి గుప్పిస్తూ జాతీయ మీడియాలో భారీ ప్రకటనలు గుప్పించి మరీ హైప్ కోసం ప్రయత్నించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలన్నీ తమకు కూడా తెలంగాణ మోడల్ ప్రభుత్వం కావాలని కోరుతున్నాయంటూ మీడియాలో ప్రచారం కల్పించారు.

అయితే సర్వేల ఫలితాలు  మాత్రం బీఆర్ఎస్ ను జనం లైట్ గా తీసుకున్నారన్న భావాన్నే కలిగిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం జరిగి ఆరు నెలలు కావస్తోంది. పేరు మార్పు జరిగీ నెలలు గడిచాయి. అయినా ఇంత వరకూ జాతీయ స్థాయిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రభావం కానీ, జనంలో చర్చ కానీ జరగడం లేదు. ఖమ్మంలో భారీ సభ నిర్వహించినా, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనా.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను సీరియస్ గా తీసుకున్న పార్టీ ఏదీ అంటే జవాబు చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వినా బీజేపీయేతర కూటమి పట్ల ఏ పార్టీ కూడా పెద్దగా సుముఖంగా లేదు. ఈ విషయాన్ని ఆయా పార్టీలే ప్రకటిస్తున్నాయి.

తాజాగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి, ఆ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేసీఆర్ ఆహ్వానం పంపారు. అయితే కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను సభకు హాజరు కాబోవడంల లేదని సమాచారం ఇచ్చిన నితీష్ కుమార్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ వస్తారని పేర్కొన్నారు. అయినా బీఆర్ఎస్ సభకు హాజరైనంత మాత్రాన కాంగ్రెస్ తో పొత్తుకు విముఖమని కాదని ముక్తాయించారు. అంటే.. ఆయన మాటలను బట్టి బీఆర్ఎస్ తమ జట్టులో చేరితే చేరాలి కానీ.. తాము కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వెనుక ర్యాలీ కావడానికి సిద్ధంగా లేమని చెప్పకనే చెప్పేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.