Publish Date:Apr 17, 2025
హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పుప్పాలగూడ భూముల్లో ఐటీ హబ్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, రెవెన్యూ, స్పెషల్ పోలీస్ సొసైటీలకు కేటాయించిన ఈ భూమిలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
Publish Date:Apr 17, 2025
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో దారుణం చోటుచేసుకుంది.ఇద్దరు కుమారులను వేట కొడవలితో నరికి చంపింది తల్లి. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది.హత్యకు గురైన పిల్లల వయసు 7, 5 ఏండ్లు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Publish Date:Apr 17, 2025
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని న్యాయస్ధానం టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
Publish Date:Apr 17, 2025
నెల్లూరు లో వేరు వేరు సంఘటనల్లో ఇద్దరుు దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల్లూరు అయ్యప్ప గుడి వద్ద కారు ట్రావెల్ యాజమాని అల్లా బక్షు టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ గ్యాంగ్ మోటార్ బైక్ మీద వేగంగా వచ్చి బక్షు బైకును డీ కొట్టారు.
Publish Date:Apr 17, 2025
హీరో షైన్ టామ్ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు. కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ బృందం ఉదయం 11 గంటల సమయంలో రైడ్ చేసింది. అయితే పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో మూడో అంతస్తులో ఉన్న రూం కిటికీ నుండి రెండో అంతస్తులోకి దూకి, అక్కడి నుంచి మెట్ల ద్వారా చాకో పారిపోయినట్లు తెలుస్తోంది.
Publish Date:Apr 17, 2025
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక విధంగా జగన్ కి ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ ఝలక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో 793 కోట్ల రూపాయల విలువైన దాల్మిచా సిమెంట్స్ ఆస్తులను గురువారం (ఏప్రిల్ 17) అటాచ్ చేసింది.
Publish Date:Apr 17, 2025
తిరుపతిలోని ఎస్పీ గో శాలలో గడిచిన మూడు నెలల్లో 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలో గురువారం (ఏప్రిల్ 17) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరుణాకరరెడ్డి ఆరోపణలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. అలాగే టీటీడీ ఈవో శ్యామల రావు, కూటమి నాయకులు కూడా ఖండించారు.
Publish Date:Apr 17, 2025
నటుడు దళపతి విజయ్‌పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతడికి దూరంగా ఉండాలని తమిళనాడు ముస్లింలకు సూచిస్తూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఈ ఫత్వాను జారీ చేశారు. విజయ్ గత చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.మద్యం ప్రియులు, అల్లరి మూకలను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం ద్వారా విజయ్ రంజాన్ మాసం యొక్క పవిత్రతను దిగజార్చారని రజ్వీ వెల్లడించారు.
Publish Date:Apr 17, 2025
మాజీ మంత్రి రోజా మరో సారి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన రోజా ఈ రోజు తిరుపతిలో తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. గోశాలలో గోవుల మృతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 17, 2025
తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్. త్వరలో మద్యం ధరలను పెంచాలని ఆలోచన చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్.ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మద్యం రేటులను పెంచే అవకాశాలు కనబడుతున్నాయి.
Publish Date:Apr 17, 2025
మడకశిర ఎమ్మెల్యే చెప్పినట్టు.. వెంకటేశ్వరస్వామి అంటే ఎంత మాత్రం భక్తిభావం లేని కరుణాకరరెడ్డి ఏమిటి? ఇంత భారీ ఎత్తున గోనాటకం మొదలు పెట్టడమేంటి? నిజంగానే గోవులపై ఆయనకింతటి ప్రేముందా? ఇందులో దాగిన అసలు మతలబేంటి? అన్నదిప్పుడు ప్రశ్నార్ధకం అయి కూర్చుంది.
Publish Date:Apr 17, 2025
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి.. తెలుగుదేశంలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన ఆయన.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. మంత్రి పదవి ఆశించారు. కానీ, వివిధ సమీకరణాలతో ఆయనకు కేబినెట్ లో ఛాన్స్ దక్కలేదు.
Publish Date:Apr 17, 2025
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ, శాసన మండలిలో అమోదం పొందాయి. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకు గవర్నర్
జస్టిస్ అబ్ధుల్ నజీర్ అమోదం తెలపడంతో వాటిని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేశారు.